Modi Trump Talks: పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్.. కారణం అదేనా..
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Modi Trump Talks: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో చర్చించారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ట్రంప్ తో ప్రధానంగా చర్చించారు. వాణిజ్య అంశాలతో పాటు ప్రపంచ పరిణామాలపై సుదీర్ఘంగా డిస్కస్ చేశారు ఇరువురు నేతలు. వ్యాపారం, టెక్నాలజీ, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై డిస్కస్ చేశారు. ఉమ్మడి లాభదాయక అంశాల్లో కలిసి పని చేయాలనే అంగీకారానికి వచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రష్యాకు సహకరిస్తున్నారన్న నెపంతో భారత్ పై అదనపు సుంకాలు వేస్తామని హెచ్చరించారు ట్రంప్. బియ్యం దిగుమతులపై ఫోకస్ పెట్టినట్లు ప్రకటించారు. భారత్ నుంచి వచ్చే బాస్మతి బియ్యంపై అదనపు పన్నులు వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ కు మోదీ ఫోన్ చేసి చర్చించడం ఆసక్తికరంగా మారింది.
