Palm Trees : తాటిచెట్ల పెంపకంపై స్టాలిన్ సర్కార్ దృష్టి…ఎందుకంటే..

ఇప్పటికే శ్రీలంక దేశం తాటి చెట్ల నుండి ఉత్పత్తి చేసిన నీరాను బీరుగా మార్చి దేశీ అవసరాలకు పోను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.

Palm Trees : తాటిచెట్ల పెంపకంపై స్టాలిన్ సర్కార్ దృష్టి…ఎందుకంటే..

Toddy Palm

Palm Trees : వ్యవసాయ శాఖకు ప్రతిఏటా లక్షల తాటి విత్తనాలు పంపిణీ చేస్తానంటూ తమిళనాడు అసెంబ్లీ వేదికగా స్పీకర్ అప్పావు చేసిన ప్రకటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాష్ట్రం ఎందుకు తాటి చెట్ల పెంపకానికి అంత ప్రాధాన్యత ఇస్తుందోనన్న చర్చ ప్రారంభమైంది. తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర చెట్టుగా తాటి చెట్టును పరిగణిస్తోంది. అలాగే ఇదే తరహాలో కాంబోడియా దేశం తమ జాతీయ చెట్టుగా తాటిచెట్టును గుర్తిస్తుండటం చూస్తే తాటిచెట్టు ప్రాముఖ్యత ఏంటో ఇపాటికే అర్ధమై పోయి ఉంటుంది.

తమిళనాడులో ఇప్పటికే పూడిక తీత పనుల్లో భాగంగా వేలాదిగా తాడిచెట్లను నరికివేశారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం తాటి చెట్ల పరిరక్షణపై దృష్టిసారించింది. తాటి చెట్లను నరకటం నిషేదం విధించటంతోపాటు, ఎవరైనా ఆ చెట్టు నరకాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధన విధించింది. సునీమీ సమయంలో , ప్రకృతి వైపరిత్యాల సమయంలో తాటిచెట్టు తట్టుకుని నిలబడటంతోపాటు, స్ధానికంగా తాటిచెట్ల నుండి కల్లు, తాటిబెల్లం తయారీ వంటివి ఉపాధిగా మారటంతో ప్రభుత్వం వీటి పెంపకంపై దృష్టిపెట్టింది.

ఇప్పటికే శ్రీలంక దేశం తాటి చెట్ల నుండి ఉత్పత్తి చేసిన నీరాను బీరుగా మార్చి దేశీ అవసరాలకు పోను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. శ్రీలంక తాటి బీరుకు ప్రస్తుతం విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తాటిచెట్ల ద్వారా అదాయం పొందటంతోపాటు, ప్రకృతి విపత్తుల నుండి తీర ప్రాంతాల రక్షణకు దోహదకారిగా ఉపయోగపడుతుందన్న తలంపుతో ఉంది.

తాటిచెట్లకు పురాతన చరిత్ర ఉంది. తాటి ఆకులను అప్పట్లో గ్రంధాలు వ్రాసేందుకు ఉపయోగించేవారు. ఒక్కో చెట్టు నుండి ప్రతి ఏటా 10వేల రూపాయల అదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏడాదిలో 100 రోజుల పాటు కల్లు నిచ్చే తాటి చెట్టు ద్వారా నెలకు 1000 రూపాయల వరకు అదాయం లభిస్తుంది. ఇక తాటి బెల్లం ఉత్పత్తి చేయటం ద్వారా అదాయం సమకూర్చుకోవచ్చు. ఒక్కో చెట్టు నుండి 40 కేజీల వరకు తాటి బెల్లం తయారు చేయవచ్చు. పిడుగుల నుండి రక్షణగా తాడిచెట్లు ఉపయోగపడతాయి.

120 ఏళ్ళ సుదీర్ఘ ఆయుష్షు కలిగి ఉండటంతోపాటు ఎలాంటి వాతావరణంలోనైనా తాడిచెట్టు పెరుగుతుంది. పొలాల్లో గట్లపైనే వీటి పెంపకాన్ని చేపట్టవచ్చు. దీని వల్ల రైతులకు కొంత అదాయం తాటిచెట్ల నుండి సమకూరుతుంది. తాటి చెట్లను విరివిగా పెంచటం ద్వారా ప్రమాదకరమైన మత్తుపదార్ధాలతో తయారవుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.