Sugarcane Farming: ప్రకృతి విధానంలో చెరకు సాగు – వచ్చిన దిగుబడులతో బెల్లం తయారీ

బెల్లం ఎన్నో ఔషాధాలకు గని. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ప్రాముఖ్య పాత్ర పోషిస్తోంది. అందులోనూ సేంద్రియ బెల్లం... రుచి, సుగుణాలే వేరు. సేంద్రియ పద్ధతిలో చెరకును పండించి...

Sugarcane Farming: ప్రకృతి విధానంలో చెరకు సాగు – వచ్చిన దిగుబడులతో బెల్లం తయారీ

Sugarcane Crop (2)

Sugarcane Farming: బెల్లం ఎన్నో ఔషాధాలకు గని. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ప్రాముఖ్య పాత్ర పోషిస్తోంది. అందులోనూ సేంద్రియ బెల్లం… రుచి, సుగుణాలే వేరు. సేంద్రియ పద్ధతిలో చెరకును పండించి… ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పదార్థాలతోనే బెల్లం తయారు చేస్తే ఆ మాధుర్యం వర్ణనాతీతం. విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు… ఇదే విధానంలో బెల్లం తయారు చేస్తున్నారు.

రసాయన ఎరువుల జోలికి పోకుండా కేవలం ప్రకృతి విధానంలో చెరకును సాగుచేస్తున్నారు విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గరుగుబిల్లి గ్రామానికి చెందిన రైతు ప్రభాకరరాజు. తనకున్న 15 ఎకరాల్లో 8 ఎకరాల్లో చెరకు మిగితా 8 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

జీరో బడ్జెట్ నాచురల్ పార్మింగ్ సభ్యుల సలహాలు, సూచనలతో నాణ్యమైన అధిక దిగుబడులను సాధిస్తున్నారు. సేంద్రీయ విధానంలో సాగు చేసిన చెరకుతో స్వయంగా బెల్లం తయారీ చేస్తున్నారు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. టన్ను చెరకు నుంచి 80 నుండి 90 కిలోల బెల్లాన్ని తయారు చేస్తున్నారు. మంచి రంగు, రుచి, వాసన ఉండటంతో ఈ బెల్లంకు మంచి డిమాండ్ ఏర్పడింది.