Sesame Farming : ఖరీఫ్ కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

నూనెగింజల పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు.

Sesame Farming : ఖరీఫ్ కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

Varieties of sesame suitable for Kharif

Sesame Farming : ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. గత ఐదేళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతుండటంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.

READ ALSO : Cashew Nuts Price : తగ్గిన జీడిపిక్క ధర.. ఆందోళనలో రైతులు

అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి  వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి.

READ ALSO : Organic Oil : గానుగ నూనె తయారీ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న వాసాలమర్రి యువకుడు

నూనెగింజల పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు.

READ ALSO : Sesame Cultivation : నువ్వుసాగులో యాజమాన్యం

అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంటసాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది. అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్ గా మే 15 నుండి మే చివరి వరకు వేస్తుండగా, రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా ,రెడ్డిపల్లి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. భార్గవి.