అందుకే జగన్, జూ.ఎన్టీఆర్ అంటే ఇష్టం…

అందుకే జగన్, జూ.ఎన్టీఆర్ అంటే ఇష్టం…

10TV Exclusive Interview with AP Minister Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. సీఎంకు అత్యంత ఆప్తుడు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనీయడు. చూసేందుకు రఫ్‌గా కన్పించినా … నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్న. నా అనుకున్న నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ తపించే వ్యక్తి. ఆయన అధికార పార్టీలో ఆరడుగుల బుల్లెట్టు… రాజకీయ రచ్చలో ఎంతకైనా తెగించే రకం… నిర్మొహమాటంగా మాట్లాడే నైజం ఆయన సొంతం… జనంతో మమేకమవుతూనే…ప్రత్యర్థులపై ఒంటికాలితో లేవడంలో ఆయన తర్వాతే ఎవరైనా…! రాజకీయ చదరంగంలో రాటుదేలిన మంత్రి కొడాలి నానితో ఇవాల్టి 10టీవీ క్వశ్చన్ అవర్ ….

ఎన్టీఆర్ మీద అభిమానంతోనే టీడీపీలో పనిచేశాని కొడాలి నాని తెలిపారు. పదవుల కోసం టీడీపీలో పనిచేయలేదన్నారు. టీడీపీని చంద్రబాబు స్థాపించలేదని చెప్పారు. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నారు..టీడీపీ జాతీయ పార్టీ అని ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిందా అని అడిగారు. ఫేక్‌ అధ్యక్షుడు చంద్రబాబు .. ఫేక్‌ పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను చూద్దాం…

జగన్ కు మీకు ఉన్న బంధమేంటి?
నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం నందమూరి తారక రామారావు. ఆయనపై ఉన్న ఇష్టంతో ఆయన కుమారుడైన నందమూరి హరికృష్ణ వెనకాల, ఆయనతోపాటు ప్రయాణం చేశాను. వైస్రాయ్ హోటల్ లో జరిగిన సంఘటన నుంచి హరికృష్ణ మరణం వరకు ప్రతి మలుపులో ఉన్నాను. ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగుదేశంలో ఉన్నాను కానీ చంద్రబాబు నాయుడుపై అభిమానతోనూ, పదవుల కోసం టీడీపీలో పని చేయలేదు. 1999లో గుడివాడలో
హరికృష్ణ పార్టీ స్థాపించి పోటీ చేసినప్పుడు నేను ఆయన వెనకాల ఎలక్షన్ చీఫ్ ఏజెంట్ గా ఈ ప్రాంతంలో ఆయన గెలుపు కోసం కృషి చేశాను. తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఆయనే నన్ను తెలుగుదేశంలోకి పంపించి తర్వాత హరికృష్ణ టీడీపీలోకి వచ్చారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా, ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ తోపాటు వారందరితో కంటిన్యూ కావడం అయ్యాను.

మళ్లీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, హరికృష్ణతో ఉన్న పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి దగ్గర కనిపించాయి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని అణువణువు ద్వేషిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వాడుకోవడం, హరికృష్ణ పార్టీ ఓటమి చెందినప్పుడు ఆయన్ను తీసుకొచ్చి రాజ్యసభ సీటు ఇవ్వడం గానీ, ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టిని పరిస్థితులను చూశాకా నాకు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండలనిపించలేదు.
నాకు రాజశేఖర్ రెడ్డిని దగ్గరగా చూశాను. ఆయనకున్న గొప్ప లక్షణాల వల్లే రాజశేఖర్ పై అభిమానం కలిగింది.

జగన్ అంటే ఎందుకు మీకంత అభిమానం?
నేను జగన్ మోహన్ రెడ్డిని దగ్గరి నుంచి చూశాను. జగన్ ఎవరిని కూడా వాడు వీడు అనడు. దేవుడిని నమ్మే వ్యక్తి….నీతి నిజాయితీగా ఉంటాడు. మనం చేసేది ప్రజలకు చెప్పాలనే దృక్పథం ఉన్న వ్యక్తి జగన్. ఆయనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి, ఆయనపై జరిగే దాడికి అడ్డుపడాలనేది నా ఉద్దేశ్యం.

జగన్ ఫేక్ సీఎం, గాల్లో తిరుగుతారు..ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు ఇది చివరి ఛాన్స్ అవుతుందని చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మీరేమంటారు?

ఫేస్ పనులు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆయనపై పోటీ చేస్తానని ప్రగల్బాలు పలికి ఆయన పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చిన్నమిడతని ఎన్టీఆర్ చెప్పినటువంటి భాష ఇది. ఓడిపోయిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఎన్టీఆర్ కాళ్ల మీద పడి చంద్రబాబు టీడీపీలో చేరి ఆయనకు అన్యాయం చేసి, వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసున్నాడు చంద్రబాబు. టీడీపీ జాతీయ పార్టా? ఎన్నికలం సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిందా? టీడీపీ జాతీయ పార్టీ కాదు…ప్రాంతీయ పార్టీ. దాన్ని జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ జాతీయ అధ్యక్షుడు అంటాడు. చంద్రబాబు నాయుడు ఫేక్ అధ్యక్షుడు. దొంగ మాటలు చెబుతాడు.

మీరు టీడీపీలో ఉన్నంతకాలం చంద్రబాబుతోవున్న బంధం ఎలాంటిది? ఏ రాజకీయ పార్టైనా ప్రత్యర్థి పార్టీని పొగుడుతుందా?
చంద్రబాబు నాయుడుపై ఇష్టంతోనూ, అభిమానంతో టీడీపీలో చేరలేదు. కంటిన్యూ చేయలేదు. నేను టీడీపీలో ఉండగా చంద్రబాబుకు నాలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కనబడేవారు. దేవినేని ఉమాకు మాకు చిన్నచిన్న మనస్పర్థలు జరిగితే మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పాలనే వాడు. కానీ ఉమాను ఎక్కడ కూడా కంట్రోలో చేసే ప్రయత్నం చేయలేదు. అతన్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. మమ్మల్సీ సేవ్ చేయడం గానీ, మా మాట వినడం గానీ చేసిన పరిస్థితులు లేవు. జగన్ పార్టీ పెట్టినప్పుటి నుంచి చంద్రబాబు టీడీపీని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లారు.

మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారా?
మేము స్థానిక ఎన్నికలకు భయపడం. జగన్ మోహన్ రెడ్డి హిస్టరీలోనే లేదు భయపడటం. నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకుని గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఆపించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు మధ్యలో ఆగిపోయాయి..వాటిని నిర్వహించకుండా కొత్తగా పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుడదల చేయమేంటి? ఇదంతా రాజకీయంగా ఒక వ్యూహం.

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? జరుగవా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడం అసాధ్యమని సీఎస్ వెళ్లి ఎస్ ఈసీకి లిఖిత పూర్వకంగా ఇచ్చారు. కరోనా, ఈనెల 16 నుంచి వ్యాక్సిన్, రకరకాల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈనెల 13 తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఈ లోపు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. కానీ నిమ్మగడ్డ రమేష్ అర్ధరాత్రి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు.