Cm Jagan : అవన్నీ కొనసాగాలన్నా, మీ ఇంటికే రావాలన్నా వైసీపీకే ఓటేయండి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.

Cm Jagan : అవన్నీ కొనసాగాలన్నా, మీ ఇంటికే రావాలన్నా వైసీపీకే ఓటేయండి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Cm Jagan : కల్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ ఎన్నికలు మీ భవిష్యత్ ను నిర్ణయించేవి అని జగన్ అన్నారు. 59 నెలల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలంటే వైసీపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు జగన్.

‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్లను బాగుచేశాం. అవ్వా తాతలకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చాం. 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయం చేస్తున్నారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం. నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం.

ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఎన్డీయేలో చంద్రబాబు ఎలా కొనసాగుతారు? మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. రాజకీయాల కోసం మైనార్టీలను వేరుగా చూడటం సరికాదు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా? ఒక్కరికైనా సెంటు స్థలమైనా ఇచ్చారా? రాష్ట్రంలో ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?

చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకొస్తుందా? సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబు నైజం. చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమే. మళ్లీ సూపర్ సిక్స్ పేరుతో మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే తెలుసు. మీ ఇంటికే పథకాలు రావాలంటే వైసీపీకే ఓటు వేయండి. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి’ అని సీఎం జగన్ హెచ్చరించారు.

Also Read : మార్పు కోసం, సేవ కోసం పవన్ వచ్చాడని భావించాం.. కానీ: పోతిన మహేశ్