Corona Cases : ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ముగ్గురు మృతి

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు.

Corona Cases : ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ముగ్గురు మృతి

Covid

156 new corona cases in AP : ఏపీలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. విశాఖ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత 24 గంటల్లో 31,131 మందికి టెస్టులు నిర్వహించగా, వీరిలో 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఒక్కరోజులోనే 188 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1954 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు 31, గుంటూరు 24, తూర్పుగోదావరి 11, కృష్ణా 18, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 12, పశ్చిమగోదావరి 27 మంది కరోనా బారిన పడ్డారు. కాగా నిన్న ఏపీలో కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.

Kurnool Market : కర్నూలు మార్కెట్ లో రైతు ఆగ్రహం.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు

ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. నిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవలే బాధితులు అమెరికా నుంచి కావలికి వచ్చారు. బాధితుల్లో ఇద్దరు ప్రముఖ వైద్యులు ఉన్నారు. బాధితుల ఆస్పత్రిలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్‌పై అలర్ట్ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుంటే రూ.100 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Road Accident : విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

మాస్కుల్లేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వ్యాపార సంస్థలను 2 రోజులు మూసివేసేలా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.