Child Offender : వయస్సు 17, చేసిన నేరాలు 16, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న యువకుడు…

చిన్న వయస్సులోనే ఇంట్లా వాళ్ల మాట వినకపోవటం...సరిగా చదవకపోవటంతో వాళ్లు పట్టించుకోవటం మానేశారు. దీంతో చిన్న వయస్సులోనే రోడ్డుమీదకు వచ్చి ఈజీమనీ సంపాదించే క్రమంలో నేరస్తుడిగా మారాడు

Child Offender : వయస్సు 17, చేసిన నేరాలు 16, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న యువకుడు…

Child Offender

Child Offender :  చిన్న వయస్సులోనే ఇంట్లా వాళ్ల మాట వినకపోవటం…సరిగా చదవకపోవటంతో వాళ్లు పట్టించుకోవటం మానేశారు. దీంతో చిన్న వయస్సులోనే రోడ్డుమీదకు వచ్చి ఈజీమనీ సంపాదించే క్రమంలో నేరస్తుడిగా మారాడు 17 ఏళ్ల బాలుడు.

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామానికి చెందిన యువకుడు (17) ఇంట్లో పెద్దల మాట వినకపోవటంతో వారు వదిలేశారు.  ఈజీ మనీ సంపాదించటంకోసం యూ ట్యూబ్ లో చూసి నేరాలు చేయటం నేర్చుకున్నాడు. వాటిలో   ఏటీఎం ల దగ్గర డబ్బులు కొట్టేయటం తేలిక అనుకున్నాడు.  అందుకు ప్లాన్ వేసుకున్నాడు.

ఏటీఎంల  దగ్గర డబ్బులు విత్   డ్రా  కోసం వచ్చే వృధ్ధులను ఎంచుకున్నాడు. ఏటీఎంల  దగ్గర కాపు కాసి వారితో  పాటు లోపలికి వెళ్లేవాడు…. వారికి డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి    వారి కార్డు తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బులు డ్రా చేసి వారికి ఇచ్చేవాడు.  అప్పుడే తెలివిగా డూప్లికేట్ కార్డు వారికి ఇచ్చి ఒరిజినల్ ఏటీఎం కార్డు దొంగిలించేవాడు.

Also Read : Face Book : ఫేస్‌బుక్ ద్వారా 38 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా, తమ్ముళ్లు

అలా2018 నుంచి  ఆంధ్ర, తెలంగాణాలలో  పలు ప్రాంతాల్లో   ఏటీఎం కార్డులతో   మోసాలకు పాల్పడుతూ రూ. 10.52 లక్షలు పలువురి ఖాతాల్లోంచి కాజేశాడు.  అలా  దొంగిలించిన డబ్బులతో  విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతంగా జల్సా చేసేవాడు.  గత నెల చిత్తూరులో ఏటీఎం వద్ద ఒక వృధ్ధురాలి కార్డు తీసుకుని పారిపోయాడు.

వృధ్దురాలి ఖాతానుంచి రూ. 70 వేలు డ్రా చేశాడు.  వృధ్దురాలి ఫిర్యాదుతో కేసు  నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మైనర్ అవటంతో అతడిని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించారు. నిందితుడు గతంలో విశాఖ  జువైనల్ హోం నుంచి పారిపోయినట్లు తెలుసుకున్నారు.