Chandrababu On Youth Seats : వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన చంద్ర‌బాబు కీల‌క ప్ర‌కట‌న చేశారు. వచ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం..(Chandrababu On Youth Seats)

Chandrababu On Youth Seats : వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu Naidu

Updated On : March 29, 2022 / 10:07 PM IST

Chandrababu On Youth Seats : తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌కట‌న చేశారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ వేదికగా జ‌రుగుతున్న వేడుక‌ల్లో మాట్లాడిన చంద్ర‌బాబు.. యువ మంత్రాన్ని ప‌ఠించారు. వచ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున 40 శాతం సీట్ల‌ను యువ‌త‌కే కేటాయించ‌నున్న‌ట్లుగా చంద్ర‌బాబు కీల‌క ప్ర‌కట‌న చేశారు.

యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌న్న చంద్ర‌బాబు.. పార్టీ కోసం యువ‌త ముందుకు వ‌చ్చి పోరాడాల‌ని పిలుపునిచ్చారు. శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చిన చంద్ర‌బాబు.. స‌మాజహితం కోరే వారు రాజ‌కీయాల్లోకి రావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పారు. సంప‌ద‌ను సృష్టించ‌డంలో టీడీపీ ముందుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. రాష్ట్ర పున‌ర్నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.(Chandrababu On Youth Seats)

TDP 40th Formation Day : చంద్రన్న రాముడు.. ఎవరినీ వదలను, సినిమా చూపిస్తానంటున్న లోకేష్

”ప్రస్తుతం 40 సంవత్సరాలకు సరిపడ సమర్థవంతమైన నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలి. యువతకు విజ్ఞప్తి.. తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలపైన దాడి జరుగుతోంది. సీబీఐ, ఎన్నికల కమిషన్, పార్టీ ఆఫీస్, ఇంటిపైనా దాడి చేశారు. మీ తాటాకుల చప్పుళ్లకు ఎవరూ భయపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. తెలంగాణలో సైతం సభ్యత్వ నమోదు చేస్తాం” అని చంద్రబాబు అన్నారు.

సభ్యత్వ నమోదు ద్వారా ఇన్సూరెన్స్ మాత్రమే కాదు హాస్పిటలిటీ, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చంద్రబాబు అన్నారు. మెంబర్ షిప్ తో పాటు ఆన్ లైన్ డొనేషన్లు కూడా పెట్టామన్నారు. 20వేల మంది నుంచి రూ.48 లక్షల డొనేషన్ వచ్చిందన్నారు. ఐటీ ఉద్యోగులు ఇచ్చే డొనేషన్ తో పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామన్నారు చంద్రబాబు.

TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు

”టీడీపీకి ప్రత్యేకత ఉంది. ఓ శుభ ముహూర్తాన పార్టీ పెట్టారు. ఎన్నో కష్టాలు వచ్చినా నిలదొక్కుకున్నాం. ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఉనికి లేని జాతి కోసం ముందుకు వచ్చారు. ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ. క్యాలికులేషన్స్ తో పుట్టిన పార్టీ కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రజల ఒంట్లో ప్రవహించేంది టీడీపీ రక్తమే. తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ. నరనరాల్లో ఉంది టీడీపీ. ఎప్పుడూ ప్రజల పక్షమే టీడీపీ. తెలుగుదేశం పార్టీ ముందు రాజకీయ నాయకులు వేలి ముద్రలు వేసే వాళ్లు. కొందరు భూస్వాములు తమ తాబేదార్లకు అధికారం కట్టబెట్టేవారు. టీడీపీ ఇప్పుడు ఆలోచిస్తే… తర్వాత ఆలోచించేది ఇతర పార్టీలు. దుర్మార్గుడు ఏపీలో మీటర్ పెట్టాలంటున్నాడు. మీటర్ పెడితే రైతు మెడకు ఉరి తాడే. వెనుకబడిన వర్గాలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాము” అని చంద్రబాబు తెలిపారు.