TDP 40th Formation Day : చంద్రన్న రాముడు.. ఎవరినీ వదలను, సినిమా చూపిస్తానంటున్న లోకేష్

ప్రతి వ్యక్తి మీద రూ. 2 లక్షల అప్పు ఉండబోతోందని హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. ముల్లును ముల్లుతోనే తీయాలి....

TDP 40th Formation Day : చంద్రన్న రాముడు.. ఎవరినీ వదలను, సినిమా చూపిస్తానంటున్న లోకేష్

Nara Lokesh

Nara Lokesh Speech : ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. నేను మాత్రం మూర్ఖుడిని.. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను అధికారులను వదిలి పెట్టను…అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా వదిలి పెట్టను. .అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచ్ డైలాగ్స్ వదిలారు. తల్లి బాధేంటో తనకు తెలుసు.. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను.. అన్నీ గుర్తు పెట్టుకుంటానన్నారు. 2022, మార్చి 29వ తేదీ మంగళవారం టీడీపీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో పాల్గొని ప్రసంగించిన నారా లోకేష్.. వైసీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రజల పార్టీ.. జగనుది గాలి పార్టీ. అని, మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తల్లిని – చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారని ఎద్దేవా చేశారు.

Read More : TDP 40 Years : జగన్‌‌పై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు

టీడీపీది బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్.టీడీపీ పసుపు కుంకమ ఇస్తే.. వైసీపీ పసుపు కుంకమలు చెరిపేస్తోందన్నారు. ఫించన్ పెంచుకుంటూ పోతానన్న జగన్.. నిత్యావసరాల ధరలను పన్నులను సీఎం జగన్ పెంచుతూ పోతున్నట్లు తెలిపారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2 లక్షల అప్పు ఉండబోతోందని హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇప్పుడిలాగే ఉండాలని… రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా టీడీపీకే సాధ్యమన్నారు నారా లోకేష్. రాముడు లాంటి చంద్రన్న కావాలా..? రాక్షసుడు లాంటి జగన్ కావాలా..? అని కార్యాకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా..? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా..? సమాజంలో సగం ఉన్న బీసీలకు అధికారం అందించిన పార్టీ టీడీపీనేన్నారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆర్ అని, దళితులను లోక్ సభ, అసెంబ్లీ స్పీకరులుగా చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు.

Read More : TDP Chandrababu : టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు

ఎన్టీఆర్ దేశంలో సంక్షేమానికి పునాది వేస్తే.. అభివృద్ధి చేసి చూపింది చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు ఎన్టీఆర్ రూపకల్పన చేశారన్నారు. ఆర్టికల్ 356ను వాడి ప్రభుత్వాలని మారిస్తే.. తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీనేనన్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా సాధించిన ఏకైక పార్టీ టీడీపీయేనని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభావం చూపిన వ్యక్తులన్నారు. పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణే టీడీపీ లక్ష్యంగా చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి జిల్లాకూ భారీ పరిశ్రమలు తెచ్చామనే విషయాన్ని గుర్తు చేశారు. విశాఖకు ఎన్నో ఫార్మా కంపెనీలు, శ్రీకాకుళం జిల్లాలోని ఐటీ కంపెనీలకు భూములిచ్చామన్నారు. సంక్షేమం – అభివృద్దే లక్ష్యంగా జోడెద్దులుగా భావించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు. 1985లోనే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.. మళ్లీ 2024లో టీడీపీ జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్.