TDP 40 Years : జగన్‌‌పై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ గాలి పార్టీ.. జగన్ గాలి నాయకుడు.. ఆయన తాత వచ్చినా తెలుగుదేశం పార్టీ ఈక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్...

TDP 40 Years : జగన్‌‌పై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Ap Tdp

AP TDP President : నేటితో తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీని, తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని బాబు తెలిపారు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. అక్కడ ప్రసంగించిన అనంతరం నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై విరుచుకపడ్డారు.

Read More : TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు

వైసీపీ గాలి పార్టీ.. జగన్ గాలి నాయకుడు.. ఆయన తాత వచ్చినా తెలుగుదేశం పార్టీ ఈక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గత 40 ఏళ్ళుగా ఎరన్నాయుడు కుటుంబం టీడీపీతో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ మారిన వారు.. బ్రతికున్నా చనిపోయినట్లేనని, పార్టీలు మారిన వారు చంద్రబాబును విమర్శిస్తే.‌. సహించేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబును ఈ సందర్భంగా కోరారు. రాజకీయాల కోసం కాకుండా సామాజిక సహాయం చేయడం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. ఓటు వేసే యంత్రాలను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు.

Read More : చంద్రబాబు కీలక నిర్ణయం, విధేయతకు పట్టం, ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనగా.. అమరావతిలో జరిగే కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు.. హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ పార్టీని ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను చంద్రబాబు, టీడీపీ నేతలు సందర్శించారు. ఆ తర్వాత.. సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో.. ఎన్టీఆర్‌ సమాధి వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొని భారీ కేక్ ను కట్ చేశారు. అమరావతిలో ఆవిర్భావ వేడుకలకు భారీగా సన్నాహాలు చేశాయి టీడీపీ శ్రేణులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నుంచి.. టీడీపీ కార్యాలయం వరకు టీడీపీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆఫీస్‌లో బహిరంగ సభలో లోకేశ్‌ పాల్గొన్నారు.