Pudimadaka Beach Tragedy : పూడిమడక బీచ్‌ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఇంకా దొరకని ఆచూకీ

బీచ్ లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వారు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నర్సీపట్నానికి చెందిన పవన్ మృతి చెందగా.. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

Pudimadaka Beach Tragedy : పూడిమడక బీచ్‌ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఇంకా దొరకని ఆచూకీ

Pudimadaka Beach Incident

Pudimadaka Beach Tragedy : అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీచ్ లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. ఇప్పటికీ గల్లంతైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదన్నారు పోలీసులు. అటు రెస్క్యూ కోసం నేవీ, కోస్ట్ గార్డ్స్ సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆగిపోయింది. శనివారం ఉదయం నుంచి మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించనున్నారు.

ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 12మంది విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వారు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నర్సీపట్నానికి చెందిన పవన్ మృతి చెందగా.. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకి చెందిన సతీశ్, గణేశ్, యలమంచిలికి చెందిన చందు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం తీరం వద్ద పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. అనకాపల్లి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 12మంది విద్యార్థులు కాలేజీలో పరీక్షలు రాసి బీచ్ కి వచ్చారు. వీరిలో ఏడుగురు స్నానానికి దిగగా, మిగతా వారు తీరం వద్దే నిలుచునున్నారు. ఒక్కసారిగా రాకాసి అల రావడంతో వీరంతా సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఒడ్డునే ఉన్న తోటి విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు తేజ అనే విద్యార్థిని కొన ఊపిరితో ఉండగా కాపాడారు. చికిత్స కోసం తేజన అనకాపల్లి ఆసుపత్రికి, అనంతరం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

Pudimadaka Beach : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

పూడిమడక బీచ్ లో ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు పర్యవేక్షించాలని జిల్లా మంత్రి అమర్నాథ్ కు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పడవల్లో వెళ్లి గాలించాలని స్థానిక మత్స్యకారులను జిల్లా ఎస్పీ కోరారు. అమావాస్య కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం ఏర్పడుతోందన్నారు మంత్రి అమర్నాథ్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గల్లంతైన విద్యార్థులు..
జగదీశ్ (గోపాలపట్నం)
జస్వంత్ (నర్సీపట్నం)
గణేశ్ (మునగపాక)
రామచందు (యలమంచిలి)
సతీశ్ (గుంటూరు)