Pudimadaka Beach : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

Pudimadaka Beach : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

Pudimadaka Beach

Pudimadaka Beach : అనకాపల్లి జిల్లా పూడిమడకలో విషాదం నెలకొంది. పూడిమడక బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతదేహం సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతైన విద్యార్థుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ కి వెళ్లిన 15మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతవడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన 15మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పూడిమడక బీచ్ కి వెళ్లారు. సరదాగా స్నానం చేసేందుకు వారంతా బీచ్ కి వెళ్లారు. ఏడుగురు విద్యార్థులు సముద్రంలోకి దిగి స్నానం చేస్తున్న సమయంలో అలల ఉధృతికి లోపలికి వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోయింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఓ విద్యార్థి మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరొక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు విద్యార్థుల ఆచూకీ గల్లంతైంది. గోపాలపట్నంకు చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన యశ్వంత్, గుంటూరుకి చెందిన సతీశ్, గణేశ్, యలమంచిలికి చెందిన చందుల ఆచూకీ గల్లంతైంది. వీరి ఆచూకీ కనుగొనేందుకు కోస్ట్ గార్డ్స్ సాయం కూడా కోరనున్నారు.

Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు

హెలికాప్టర్ తో పాటు రెండు షిప్పులు వచ్చినట్లు అయితే గల్లంతైన విద్యార్థులను తొందరగా గుర్తించేందుకు అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న అనకాపల్లి ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సరదాగా గడిపేందుకు బీచ్ కి వెళ్లిన విద్యార్థులు ఇలా కెరటాలకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.