Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
ప్రేమ సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందంటూ ఓ 19 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన గోవాలో చోటుచేసుకుంది.

Murder in Beach: దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. ప్రేమ సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందంటూ ఓ 19 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. యువతిని బీచ్ కు తీసుకెళ్లిన యువకుడు ఆమెను కొట్టి చంపాడు. సౌత్ గోవా ఎస్పీ అభిషేక్ ధనియా తెలిపిన వివరాలు మేరకు..గోవాలోని న్యూ వడ్ఢేమ్ కు చెందిన దియా నాయక్(19) అనే యువతి..వాస్కోకి చెందిన కిషన్ కలంగుట్కర్ తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య కొంత బంధం ఏర్పడింది. అయితే అనుకోని కారణాల వలన తమ బంధాన్ని ఇకపై కొనసాగించలేనని దియా నాయక్, కిషన్ తో చెప్పింది. అనంతరం కొన్ని రోజుల పాటు అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో..కిషన్ తనను ప్రేమించాలంటూ దియా వెంట పడ్డాడు. యువతి ఎంతకూ ఒప్పుకోక పోవడంతో..ఆమె పై పగ పెంచుకున్నాడు.
Other Stories:Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ
ఈక్రమంలో మాట్లాడాలి రమ్మంటు మే 18న దియాను స్థానిక డాండో బీచ్ కి తీసుకెళ్లిన కిషన్..యువతిని తీవ్రంగా కొట్టి చంపాడు. అనంతరం బీచ్ వద్ద చెట్ల పొదల్లో యువతి మృతదేహాన్ని దాచిపెట్టాడు కిషన్. కాగా తమ కూతురు కనిపించడం లేదంటూ దియా తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఇచ్చిన వివరాలు మేరకు కిషన్ కలంగుట్కర్ పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు..శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా..తానే హత్య చేసినట్లు యువకుడు ఒప్పుకున్నాడు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాస్కో పోలీసులు తెలిపారు.
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు