Commonwealth Games: కామ‌న్వెల్త్ గేమ్స్ లో మ‌రోసారి స‌త్తాచాటిన అమ‌లాపురం కుర్రోడు.. డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్న‌ సాత్విక్‌ సాయిరాజ్‌

బర్మింగ్‌హామ్ లో జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త క్రీడాకారులు అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. 22 స్వ‌ర్ణ ప‌త‌కాలు, 16 ర‌జ‌తం, 23 కాంస్య ప‌త‌కాల‌తో మొత్తం 61 ప‌త‌కాలు సాధించి ప‌త‌కాల ప‌ట్టిక‌లో నాల్గో స్థానంలో ఇండియాను నిలిపారు.

Commonwealth Games: కామ‌న్వెల్త్ గేమ్స్ లో మ‌రోసారి స‌త్తాచాటిన అమ‌లాపురం కుర్రోడు.. డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్న‌ సాత్విక్‌ సాయిరాజ్‌

Satvik Sairaj

Commonwealth Games: బర్మింగ్‌హామ్ లో జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త క్రీడాకారులు అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. 22 స్వ‌ర్ణ ప‌త‌కాలు, 16 ర‌జ‌తం, 23 కాంస్య ప‌త‌కాల‌తో మొత్తం 61 ప‌త‌కాలు సాధించి ప‌త‌కాల ప‌ట్టిక‌లో నాల్గో స్థానంలో ఇండియాను నిలిపారు. సోమ‌వారం చివ‌రి రోజు జ‌రిగిన క్రీడ‌ల్లో అద్భుత ప్ర‌తిభ‌తో స్వ‌ర్ణం, ర‌జ‌తాల‌ను గెలుచుకున్న పీవీ సింధు, ల‌క్ష్య‌సేన్‌, కిందాబి శ్రీ‌కాంత్‌, సాత్విక్ సాయిరాజ్ ల‌త పాటు ప‌లువురిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభినందించారు.

Commonwealth Games: ముగిసిన కామ‌న్వెల్త్ క్రీడ‌లు.. స‌త్తాచాటిన భార‌త్ క్రీడాకారులు.. నాల్గో స్థానంలో ఇండియా

అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌తిభ చాటిన తెలుగు వాళ్ల‌లో పీవీ సింధూతో పాటు అమ‌లాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింట‌న్ డ‌బుల్స్ విభాగంలో త‌న స‌హ‌చ‌రుడు చిరాగ్ శెట్టితో క‌లిసి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించారు. అంత‌కుముందు టీమ్ ఈవెంట్ లో ర‌జ‌తం సాధించిన సాత్విక్ వ్య‌క్తిగ‌త విభాగంలో స్వ‌ర్ణం సాధించ‌డం ద్వారా డ‌బుల్ ధ‌మాకా కొట్టిన‌ట్ట‌యింది.

సాత్విక్ 2018లోనూ కామ‌న్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నాడు. అప్పుడు కూడా స్వ‌ర్ణం, ర‌జ‌త ప‌త‌కాలు కైవ‌సం చేసుకున్నాడు. అయితే అప్పుడు టీమ్ ఈవెంట్ లో స్వ‌ర్ణం, వ్య‌క్తిగ‌త విభాగంలో ర‌జ‌తం గెలుచుకున్నాడు. ఇదిలాఉంటే ఈ ఏడాది మే నెల‌లో ప్ర‌తిష్టాత్మ‌క థామ‌స్ క‌ప్ లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన భార‌త జ‌ట్టులో సాత్విక్ ఆడిన విష‌యం తెలిసిందే. మూడు నెల‌లు గ‌డవ‌కుండానే కామ‌న్వెల్త్ గేమ్స్ లో సాత్విక్ స్వ‌ర్ణం, ర‌జ‌తం సాధించ‌డం గ‌మ‌నార్హం.