Commonwealth Games: ముగిసిన కామ‌న్వెల్త్ క్రీడ‌లు.. స‌త్తాచాటిన భార‌త్ క్రీడాకారులు.. నాల్గో స్థానంలో ఇండియా

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ క్రీడాకారులు స‌త్తాచాటారు. బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా ప‌త‌కాల పంట పండించారు. వెయిట్ లిఫ్ట‌ర్లు, రెజ‌ర్లు, బాక్స‌ర్ల త‌ర‌హాలోనే ష‌ట్ట‌ర్లు సైతం చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర్చ‌డంతో బ‌ర్మింగ్ హోమ్ క్రీడ‌ల‌ను భార‌త్ ఘ‌నంగా ముగించింది.

Commonwealth Games: ముగిసిన కామ‌న్వెల్త్ క్రీడ‌లు.. స‌త్తాచాటిన భార‌త్ క్రీడాకారులు.. నాల్గో స్థానంలో ఇండియా

commonwealth games 2022

Commonwealth Games: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ క్రీడాకారులు స‌త్తాచాటారు. బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా ప‌త‌కాల పంట పండించారు. వెయిట్ లిఫ్ట‌ర్లు, రెజ‌ర్లు, బాక్స‌ర్ల త‌ర‌హాలోనే ష‌ట్ట‌ర్లు సైతం చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర్చ‌డంతో బ‌ర్మింగ్ హోమ్ క్రీడ‌ల‌ను భార‌త్ ఘ‌నంగా ముగించింది. చివ‌రిరోజు స్వ‌ర్ణ ప‌తాకాల వేట‌లో ఇండియ‌న్ క్రీడాకారులు విజ‌య‌వంతం కావ‌డంతో భార‌త్ మొత్తం 22 స్వ‌ర్ణాలు, 16 ర‌జ‌తాలు, 23 కాంస్యాలు.. మొత్తం 61 ప‌త‌కాల‌తో నాలుగ‌వ‌ స్థానంలో నిలిచింది.

Commonwealth Games: చరిత్ర సృష్టించిన భవినా పటేల్.. పారా టేబుల్ టెన్నిస్ విభాగంలో ఇండియాకు తొలి స్వర్ణం

చివ‌రి రోజు బ్యాడ్మింట‌న్‌ మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లో ప్ర‌పంచ ఏడో ర్యాంక‌ర్ సింధు కెన‌డా క్రీడాకారిణి మిచెలీపై అల‌వోక‌గా గెలిచి స్వ‌ర్ణం సాధించింది. మ‌రోవైపు కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో పోటీప‌డ్డ తొలిసారే ల‌క్ష్య‌సేన్ బ్యాడ్మింట‌న్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. మ‌లేసియా క్రీడాకారుడు జి. యాంగ్ పై విజ‌యం సాధించి స్వ‌ర్ణం గెలుచుకున్నాడు. పురుషుల డ‌బుల్స్ లో తెలుగు కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టితో క‌లిసి పురుషుల డ‌బుల్స్ స్వ‌ర్ణం సాధించాడు. సోమ‌వారం చివ‌రి రోజు మూడు స్వ‌ర్ణాలు, 1 ర‌జ‌తం, రెండు కాంస్యాల‌తో భార‌త్ క్రీడాకారులు ఘ‌నంగా బ‌ర్మింగ్ హోమ్ టూర్ ను ముగించారు. ముఖ్యంగా ఈ ద‌ఫా కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో బ్యాడ్మింట‌న్‌లో భార‌త క్రీడాకారులు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న 75ఏళ్ల వృద్ధుడు

2010లో సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ క్రీడాకారులు 38 స్వ‌ర్ణాల‌తో పాటు 101 ప‌త‌కాల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచారు. 2002 సంవ‌త్స‌రంలో జ‌రిగిన క్రీడ‌ల్లో భార‌త్ క్రీడాకారులు 30 స్వ‌ర్ణాలు స‌హా 69 ప‌త‌కాలు సాధించి ప‌త‌కాల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో నిలిచారు. ఆ రెండు కామ‌న్వెల్త్ క్రీడ‌ల త‌రువాత భార‌త్ క్రీడాకారులు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చించి బ‌ర్మింగ్ హోమ్‌లోనే. ప్ర‌స్తుతం కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ నాల్గో స్థానంలో నిలిచింది.

PV Sindhu wins gold medal : కామన్వెల్త్‌ గేమ్స్‌లో పివి.సింధుకు స్వర్ణం..వరుసగా మూడోసారి మెడల్

అయితే.. ప్ర‌తీ సారి షూట‌ర్ల హ‌వా సాగేది. 2018 వ‌ర‌కు భార‌త్ కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో 203 స్వ‌ర్ణాలు సాధిస్తే.. అందులో షూటింగ్ వాటా 63. ఈద‌ఫా క్రీడ‌ల్లో షూట‌ర్లు ఉండుంటే 2010 క్రీడ‌ల త‌ర్వాత భార‌త్ కు బ‌ర్మింగ్ హోమ్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌గా నిలిచేది. ప్ర‌స్తుతం బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రిగిన కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో 67 స్వ‌ర్ణాల‌తో స‌హా 178 ప‌త‌కాల‌తో ఆస్ట్రేలియా అగ్ర‌స్థాన‌లో నిలిచింది. ఇంగ్లాండ్ 57 స్వ‌ర్ణాల‌తో స‌హా 176 ప‌త‌కాల‌తో రెండో స్థానంలో, కెన‌డా 26 స్వ‌ర్ణాల‌తో స‌హా 92 ప‌త‌కాల‌తో మూడో స్థానంలో నిలిచింది.