Ambati Rambabu – Bro : బ్రో సినిమా పై పిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లనున్న మంత్రి అంబటి..
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పై పిర్యాదు చేయడానికి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఆగష్టు 2 సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Ambati Rambabu went delhi to complaint on pawan kalyan bro movie production
Ambati Rambabu – Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. జులై 28న రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. కాగా ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్ర ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇరిగేషన్ మంత్రి ‘అంబటి రాంబాబు’ని పోలి ఉంది అంటూ ఆడియన్స్ మాట్లాడడం, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అంబటి దాని పై రెస్పాండ్ అయ్యారు.
Tharun : పెళ్లి ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. నేనే చెప్తారా బాబు చేసుకుంటే..
ఈ క్రమంలోనే పవన్ పై విమర్శలు చేస్తూ, బ్రో మూవీ కలెక్షన్స్ లెక్కలు చెబుతూ కొన్ని రోజులు నుంచి అంబటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా బ్రో సినిమా పై పిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అమెరికా నుంచి అక్రమ ఫండింగ్ జరిగిందని రాంబాబు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ మూవీ లావాదేవీల పై పిర్యాదు చేయడానికి ఈరోజు ఆగష్టు 2 సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డితో భేటీ తర్వాత తమ పార్టీ ఎంపీలతో కలిసి సదురు దర్యాప్తు సంస్థలకు అంబటి పిర్యాదు చేయనున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి.
ఇక బ్రో మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 5 రోజులకు గాను ఈ మూవీ 113 కోట్ల 69 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ చిత్రంతో పవన్ వరసగా మూడుసార్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది వచ్చిన భీమ్లా నాయక్, అంతకుముందు ఇయర్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ సక్సెస్ టూర్ తో పలు సిటీస్ లో సందడి చేస్తున్నాడు.