అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 02:58 PM IST
అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు

అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ జరిపిన సమీక్ష కాసేపటి క్రితం ముగిసింది. 2020, జనవరి 06వ తేదీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. పథకానికి ఎవరెవరు అర్హులెవరో చెప్పారు. 300 యూనిట్లకు పై బడి విద్యుత్ వాడే కుటుంబాలకు పథకం వర్తించదన్నారు. కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపు ఉన్నా కొందరికి పథకం అందలేదని, 6 నెలల విద్యుత్ బిల్లుల సరాసరి పరిశీలించి అర్హులను గుర్తిస్తామని వెల్లడించారు. 

పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకే అమ్మ ఒడి పథకమన్నారు. ఈ పథకం ద్వారా 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపచేస్తామన్నారు. అర్హులైన ప్రతొక్కరికి అమ్మఒడి పథకం వర్తింపు చేస్తామన్నారు. ఇంగ్లీషు మీడియంపై కూడా స్పందించారు. కోర్టు తీర్పుకు లోబడే ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామన్నారు. 

జనవరి 09వ తేదీన చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని జగన్ ప్రారంభిస్తారని వెల్లడించారు. వెబ్ ల్యాండ్ రికార్డులో తప్పులు కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని, దీనిపై కంప్లయింట్స్ వస్తున్నాయని అధికారులకు సీఎం జగన్‌కు వివరించారు. ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వారిని అర్హులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. 

Read More : విషాదం : 3ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన మాంజా