ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెం.1

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 05:36 PM IST
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెం.1

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్-2019 ర్యాంకింగ్ విడుదల అయింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల జాబితాను న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు విడుదల చేశారు.



ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంకు లభించింది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో కూడా ఏపీనే ముందంజలో నిలిచింది. రెండో ర్యాంకు ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరించింది. ఇక తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.



కేంద్రం పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సాంలు ఈ జాబితాలో ర్యాంకు సాధించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఆధారంగా ఇవ్వడం జరిగిందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా కార్మిక చట్టాల్లో సంస్కరణలు, వివాదాల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా వ్యాపార నియంత్రణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.



కరోనావైరస్‌ మహమ్మారితో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ మంద గమనంలోకి పడిపోయాయని గోయల్ తెలిపారు.. కరోనా కష్ట కాలంలో భారత్ తిరిగి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టదని అన్నారు. దీనికి కారణం ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌ అంటూ తెలిపారు. 2014 వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ 142 ర్యాంకులో నిలిచింది.