ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ముఖ్యమైన తేదీలు

ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ముఖ్యమైన తేదీలు

Nimmagadda

andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరి 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 31న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది.

ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఏపీలో 2021, జనవరి 09వ తేదీ శనివారం నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 5 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

తొలి దశ : నోటిఫికేషన్ జారీ – జనవరి 23. నామినేషన్ల స్వీకరణ – జనవరి 25. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డే – జనవరి 27. నామినేషన్ల పరిశీలన – జనవరి 28. నామినేషన్ల ఉపంసహరణ – జనవరి 31. ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 05. ఓట్ల లెక్కింపు – ఫిబ్రవరి 05.

రెండో దశ : నోటిఫికేషన్ జారీ – జనవరి 27. నామినేషన్ల స్వీకరణ – జనవరి 29. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డే – జనవరి 31. నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 01. నామినేషన్ల ఉపంసహరణ – ఫిబ్రవరి 04. ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 09. ఓట్ల లెక్కింపు – ఫిబ్రవరి 09.

మూడో దశ : నోటిఫికేషన్ జారీ – జనవరి 31. నామినేషన్ల స్వీకరణ – ఫిబ్రవరి 02. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డే – ఫిబ్రవరి 04. నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 05. నామినేషన్ల ఉపంసహరణ – ఫిబ్రవరి 08. ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 13. ఓట్ల లెక్కింపు – ఫిబ్రవరి 13.

నాలుగో దశ : నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 04. నామినేషన్ల స్వీకరణ – ఫిబ్రవరి 06. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డే – ఫిబ్రవరి 08. నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 09. నామినేషన్ల ఉపంసహరణ – ఫిబ్రవరి 12. ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 17. ఓట్ల లెక్కింపు – ఫిబ్రవరి 17.