AP Corona : ఏపీలో తోకముడుస్తున్న కరోనా.. 24 గంటల్లో 280, ఆ జిల్లాలో సున్నా కేసులు

24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...

AP Corona : ఏపీలో తోకముడుస్తున్న కరోనా.. 24 గంటల్లో 280, ఆ జిల్లాలో సున్నా కేసులు

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా తోక ముడుస్తోందా ? గత కొద్ది రోజుల నుంచి పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు 200 నుంచి 300 వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. తాజాగా…24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18 వేల 915 కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 496 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 3,30,66,774 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 722కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,98,033. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 వేల 709గా ఉంది.

Read More : Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 44. చిత్తూరు 16. ఈస్ట్ గోదావరి 44. గుంటూరు 28. వైఎస్ఆర్ కడప 08. కృష్ణా 18. కర్నూలు 01. నెల్లూరు 08. ప్రకాశం 40. శ్రీకాకుళం 0. విశాఖపట్టణం 34. విజయనగరం 01. వెస్ట్ గోదావరి 38. మొత్తం :- 280

Read More : Delhi Night Curfew : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలకు ముగింపు, కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూల్స్ రీ ఓపెన్

ఇక భారతదేశ విషయానికి వస్తే.. రోజువారి కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13 వేల 166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా 302 మంది చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 13 వేల 226కి చేరింది. 26 వేల 988 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4 కోట్ల 22 లక్షల 4 వేల 884కి చేరింది. డైలీ పాజిటివ్ రేటు 1.28గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 34 వేల 235గా ఉంది.