పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు

పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు

AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఏపీ రెండు అవార్డులు సొంతంచేసుకున్నది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విధానాలు, టూల్స్‌ వాడుతున్నందుకు ఏపీకి రెండో ర్యాంకు, అవార్డు దక్కింది.

బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఉత్తమ టెక్నాలజీకిగాను ఏపీకి 3వ ర్యాంకు, అవార్డు లభించింది. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌కార్పొరేషన్‌కు మొదటి ర్యాంకు, అవార్డు దక్కింది.

జీహెచ్‌టీసీ–ఇండియా కింద ఆరు లైట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన, పీఎంఏవై(అర్బన్‌), ఆశా–ఇండియా అవార్డుల కార్యక్రమాలను వర్చువల్‌ పద్ధతుల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు.