Andhra University Campus : 10టీవీ ఎఫెక్ట్.. ఆంధ్ర యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్

ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు. పక్కలు, పరుపులు, వ్యభిచారం. వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు. డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు..(Andhra University Campus)

Andhra University Campus : 10టీవీ ఎఫెక్ట్.. ఆంధ్ర యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్

Andhra University Campus

Andhra University Campus : ఆంధ్ర యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు, శక్తులకు అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. కామ పురాణం పేరుతో క్యాంపస్ లో జరుగుతున్న అరాచకాలపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. విద్యకు నెలవైన నేలపై వ్యభిచారం జరుగుతున్న తీరును కళ్లకు కట్టింది. దీంతో ఏయూ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన స్థలాన్ని జేసీబీలతో చదను చేశారు. వెదురు పొదలు తొలిగించారు. యూనివర్సిటీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో హాస్టల్ వెనుక ప్రాంతంలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు.

Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే వర్సిటీ క్యాంపస్ నిన్నటివరకు కామరాజులకు కేరాఫ్ గా మారింది. నాడు నేడులో భాగంగా అధికారులు క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేస్తుండగా కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. ఇంజినీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో చెత్త కుప్పలు తొలగిస్తుండగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. కొన్ని అసాంఘిక శక్తులు ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ పరువుని మంట కలిపాయి.

Hyderabad Police : చదువు పేరుతో ఇండియాకొచ్చి వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

దేశానికే తలమానికంగా ఉండాల్సిన యూనివర్సిటీ పేరుని దిక్కుమాలిన పనులతో చెడగొట్టారు. క్యాంపస్ ను వ్యభిచారానికి అడ్డాగా మార్చేశారు. వర్సిటీ ప్రాంగణంలో పక్కలు ఏర్పాటు చేశారు. గుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అలాగే డ్రగ్స్ వినియోగం జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. వెదురు పొదలపై పడకలు, పరుపులు కనిపించాయి. చెట్ల మాటున వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు లభ్యం అయ్యాయి.(Andhra University Campus)

క్యాంపస్ లో ఇటీవల వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ యువకుడు దారుణ హత్యతో పాటు చైన్ స్నాచింగ్, దారిదోపిడీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గుర్తింపు కార్డు లేకుండా క్యాంపస్ లోకి వచ్చే వారిని వెనక్కి పంపేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆ పరిసరాలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి.

ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరిగా తయారు చేసి వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు కూడా ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అక్కడికొచ్చి డ్రగ్స్ తీసుకుంటున్న ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ క్యాంపస్ వెనుక భాగం ఏపుగా చెట్లు పెరిగి నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా హిజ్రాలు ఆ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. రోజూ హిజ్రాలు వస్తున్న విషయాన్ని విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో చెట్లపై ఏకంగా పక్కలు ఏర్పాటు చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఫలితంగా క్యాంపస్ కండోమ్ ల మయంగా మారింది. వందల సంఖ్యలో మద్యం సీసాలు, కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు కనిపించడంతో అధికారులు రంగంలోకి దిగారు. వాటి తొలగింపు పనులు ముమ్మరం చేశారు. మద్యం సీసాలు, కండోమ్స్ తో విద్యార్థులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ కాలేజీ వద్ద సెక్యూరిటీ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.