MLA Anil Kumar Yadav: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. పై నుంచి కింది దాకా వలిచేస్తా

నేను మీడియాలో మాట్లాడిన ప్రతిసారి బెట్టింగ్ రాజు అనే కామెంట్లు నాకు వస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? ఆ పాపాన్ని నేను మోస్తున్నా అంటూ అనిల్ అన్నారు.

MLA Anil Kumar Yadav: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. పై నుంచి కింది దాకా వలిచేస్తా

MLA Anil Kumar Yadav

MLA Anil Kumar Yadav: నెల్లూరు నగర వైసీపీలో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. నెల్లూరు వైసీపీ విద్యార్థినేత హాజీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను జీజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. హాజీ నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు. రూప్ కుమార్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక అనిల్ కుమార్ యాదవ్ హస్తం ఉందంటూ ఆరోపించారు. ఈ దాడి ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని, నేను నోరు విప్పితే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అంటూ అనిల్ కుమార్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Congress MLC Jeevan Reddy: కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది.. 2000 నోట్ల రద్దుపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

రూప్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఓపికను పరీక్షించొద్దు.. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా అంటూ రూప్ కుమార్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేత హాజీ పై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని, సిటీలో ఏమి జరిగినా దానికి కారణం అనీలే అంటూ నాపై బురద జల్లుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక నేనున్నానని బాధితుడిని ప్రోత్సహించి నా పేరు చెప్పించారు. గతంలో హాజీకి ఏవైనా వివాదాలు ఉంటే వాటివల్ల ఈ దాడి జరిగి ఉండొచ్చు. నా ఓపికను పరీక్షించవద్దు. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా అంటూ అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Andhra Pradesh : నేను నోరు విప్పితే అడ్రస్ లేకుండా పోతావ్ : ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై డిప్యూటీ మేయర్‌ ఫైర్

నేను మీడియాలో మాట్లాడిన ప్రతిసారి బెట్టింగ్ రాజు అనే కామెంట్లు నాకు వస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? ఆ పాపాన్ని నేను మోస్తున్నా అంటూ అనిల్ అన్నారు. ఆ పాపం నాది కాదని నన్ను విమర్శించిన వ్యక్తి దేవుని ముందు ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు. నేనుకానీ దిగజారితే.. ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చి ఉంటాయి.. ఐదు నిమిషాలు చాలు లీక్ ఇచ్చే దానికి , ఆధారం లేకుండా మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పై నుంచి కింది దాకా వలిచేస్తా అంటూ రూప్‌కుమార్ యాదవ్‌కు పరోక్షంగా అనిల్ హెచ్చరికలు జారీ చేశారు.