Andhra Pradesh : నేను నోరు విప్పితే అడ్రస్ లేకుండా పోతావ్ : ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై డిప్యూటీ మేయర్‌ ఫైర్

నా వెంట ఉంటున్నాడనే కారణంతోనే హాజీపై దాడి చేయించారు అంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆరోపించారు. హాజీపై దాడి చేయించటం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ హస్తం ఉంది అంటూ ఆరోపించారు.

Andhra Pradesh : నేను నోరు విప్పితే అడ్రస్ లేకుండా పోతావ్ : ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై డిప్యూటీ మేయర్‌ ఫైర్

nellore deputy mayor mla anil kunar yadav

MLA Anil Kumar Yadav : నెల్లూరు వైపీసీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నేను నోరు విప్పితే అనిల్ కుమార్ అడ్రస్ లేకుండాపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్. నేను తయారు చేసిన బొమ్మవి నువ్వు.. నేను నోరు విప్పతి అనిల్ అడ్రస్ ఉండదు అంటూ హెచ్చరించాడు. నా వెంట ఉంటున్నాడనే కారణంతోనే విద్యార్ది నేత హాజీపై దాడి చేయించారు అంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆరోపించారు. హాజీపై దాడి చేయించటం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ హస్తం ఉంది అంటూ ఆరోపించారు. ఈ దాడి ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని..నెల్లూరు వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు రూప్ కుమార్ యాదవ్.

కాగా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యదవ్ కు బాబాయ్ అవుతారు. రూప్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మధ్య గత కొంతకాలంలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలో రూప్ కుమార్ ముఖ్య అనుచరుడిగా ఉంటున్న ముస్లిం మైనార్టీ నేత అబ్దుల్ హాజీపై దాడి జరిగింది. ఇది హత్యాయత్నం అని భావిస్తున్నారు. ఈ దాడి వెనుక అనిల్ కుమార్ హస్తం ఉందని రూప్ కుమార్ ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగానే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. పార్టీ ఉన్నతి కోసం కష్టపడి పనిచేసిన హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారని ఇది కేవలం తనతో పాటు ఉంటున్నాడనే కారణంతోనే జరిగిందని ఈ దాడి వెనుక అనిల్ కుమార్ హస్తం ఉంది అంటూ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా పనిచేసేవ్యక్తులపై ఇటువంటి దాడులు చేయడం మంచిది కాదన్నారు రూప్ కుమార్ యాదవ్. ఈ దాడి విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు.