ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PGCET 2020 నోటిఫికేషన్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : March 20, 2020 / 05:26 AM IST
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PGCET 2020 నోటిఫికేషన్ రిలీజ్

గుంటూరులోని ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2020వ సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మాథ్యమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ రకాల గ్రూపులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా యూనివర్సిటీతో పాటు, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. 

విద్యార్హత : అభ్యర్దులు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష రాస్తున్న అభ్యర్దులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం :
ఈ ప్రవేశ పరీక్షలో మెుత్తం 100 మార్కులు ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్దులు పరీక్ష రాసేందుకు 90 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : అభ్యర్దులు రూ.600 చెల్లించాలి.
> రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27, 2020
> తత్కాల్ ఫీజు : రూ.1000 తో ఏప్రిల్ 30, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ : 20 ఏప్రిల్ 2020.
అడ్మిట్ కార్డు రిలీజ్ తేదీ : మే 1, 2020.
ప్రవేశ పరీక్ష తేదీ : మే 5, 2020 నుంచి మే 7, 2020.

పరీక్ష కేంద్రాలు : ఒంగోలు, గుంటూరు, విజయవాడ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Also Read | NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు