AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

నేడు ఉ.11 గం.లకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమించింది.

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Ap Cabinet

Discussion several key issues : ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం ఇటీవల నియమించగా..వాటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా వారి నియామకానికి వీలుగా చట్టసవరణ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. దేవాదాయ చట్టం 97కు సవరణ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుదారులు గడువు ముగిసినా… ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తుండటంతో దేవాదాయశాఖలోని సెక్షన్‌ 83ను కూడా సవరించనున్నారు.

ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు, ఇతర భద్రత ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా… దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటుకు సెక్షన్‌ 12కు సవరణ చేయనుంది కేబినెట్. అలాగే ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం తుది ఆమోదం తెలుపనుంది. ఇటీవల ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో ఫిర్యాదులపై కూడా కేబినెట్ చర్చించనుంది.

High Court : టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో విచారణ

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామ‌కంపై కూడా కేబినెట్‌ చర్చించనుంది. ప్రత్యేక ఆహ్వానితుల కోసం చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉండగా.. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చ‌ట్టస‌వ‌ర‌ణ‌ చేసే అంశంపై దృష్టిసారించనుంది.. దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం వైఎస్‌ జగన్. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం ఇటీవల నియమించగా..వాటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా వారి నియామకానికి వీలుగా చట్టసవరణ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది.

మరోవైపు.. దేవాదాయ చట్టం 97కు సవరణ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుదారులు గడువు ముగిసినా.. ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తుండటంతో దేవాదాయశాఖలోని సెక్షన్‌ 83ను కూడా సవరించనున్నారు. ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు, ఇతర భద్రత ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా… దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటుకు సెక్షన్‌ 12కు సవరణ చేయనుంది కేబినెట్.

AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అన్ని థియేటర్లకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. సినీ ప్రముఖులు కోరితేనే.. ఆన్‌లైన్ విధానంలో సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని.. సినిమా టికెట్ల విషయంలో జరుగుతున్న పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను తీసుకొచ్చామమని చెబుతున్నారు.

బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. టిక్కెట్ రేట్లను పెంచడం, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ.. ప్రజలకు మేలు చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటోంది ప్రభుత్వం. ఇక ఈ అంశంపై.. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలనే నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై కేబినెట్‌లో చర్చించి మంత్రివర్గం తుది ఆమోదం తెలపనుంది.

Covid : కుటుంబానికి రూ.50వేలు.. జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు.. దరఖాస్తు ప్రక్రియ..

మరోవైపు సీఎం జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీలు, ఇతర ఆధారాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశముంది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నందున.. సభ నిర్వహణపైనా గవర్నర్‌తో చర్చించే అవకాశాలున్నాయి.