High Court : టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో విచారణ
టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

Ttd Board
appointment of members with criminal history : టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భారత వైద్యమండలి మాజీ చైర్మన్ కేతన్దేశాయ్ను సభ్యుడిగా నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
భాను ప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌పై న్యాయవాది అశ్వినికుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న హైకోర్టు.. టీటీడీ కార్యనిర్వాహణాధికారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది.
Huzurabad : హుజూరాబాద్ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు
మరోవైపు ఏపీ ప్రభుత్వం టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే దేవాదాయ శాఖకు చెందిన పలు చట్టాలను సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై రేపు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవలే 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని హైకోర్టు నిలిపి వేసింది. దేవాదాయశాఖలోని ఏ సెక్షన్ ప్రకారం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో వారి నియామకానికి వీలుగా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ద్వారా టీటీడీ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు వీలుంటుందని భావిస్తోంది.
Air Hostess : ఎయిర్ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు
శ్రీవారి భక్తులు, యాత్రికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఆహ్వానితుల నియామకం దోహదపడుతుందని ప్రతిపాదిస్తున్నారు. అలాగే దేవాదాయశాఖకు చెందిన పలు చట్టాల సవరణలపై నిర్ణయం తీసుకోనున్నారు