Huzurabad : హుజూరాబాద్‌ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు

హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ...ఓటర్లకు నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.

10TV Telugu News

Cash distribution to voters : హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు …ఓటర్లకు నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. నగదు జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి మరీ నగదు కవర్లు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు 6 వేల రూపాయల చొప్పున ఎన్వలప్‌ కవర్‌లో పెట్టి ఇస్తున్నారు. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో డోర్‌ టు డోర్‌ తిరిగి ఓటుకు నగదు పంపిణీ చేస్తున్న దృశ్యాలను కొంతమంది రహస్యంగా సెల్‌ఫోన్‌ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారు. అలాంటి వీడియోలో ఇదొకటి. ఇది చూస్తే తెలుస్తోంది నగదు ప్రలోభాల పర్వం ఎంతెలా ఉందో. ఒక కవర్‌లో ఆరు వేల రూపాయల నగదు ఉంది. అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే. ఇలా..కరెన్సీ నోట్లు ఉన్న కవర్లను గంపగుత్తగా తీసుకొచ్చి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నిక…నేటితో ప్రచారానికి తెర

హుజూరాబాద్ బై పోల్ ప్రచారం సాయంత్రంతో ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరగనుంది? 72 గంటల గ్యాప్‌లో ఓటర్ల మనసు మారిపోతే? ఓటరు దేవుడు కరుణించకపోతే ఏంటి పరిస్థితి? ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వరకు ఏం చేయాలి? ప్రత్యక్షంగా వెళ్లి అడగలేరు. అభ్యర్థులను వెంటాడుతున్న ప్రశ్నలివీ. కానీ బ్యాక్ డోర్‌ రెడీగా ఉందంటున్నారు. నియోజకవర్గంలో పార్టీల ప్రచారం ఇవాళ్టితో ముగుస్తుంది. పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది. ఈ గ్యాప్‌లో తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఏ ఎన్నిక జరిగినా…క్యాంపెయిన్ ముగిశాక…ఓట్లర్లను ప్రలోభ పెట్టే మంత్రం పార్టీల దగ్గర ఉంటుంది. ఆ మంత్రమే గెలుపునకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దీన్ని హుజూరాబాద్‌లోనూ ప్రయోగించనున్నారు. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. నియోజకవర్గంలో ఓటుకు ఇంత మొత్తమనేలా డబ్బు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే భారీగా మద్యం పంపిణీకి జరుగుతోందని ప్రచారం. ఇక ఇంటింటికి మాంసం, చీరలు, ఇతర వస్తులు ఇలా అన్ని రకాలు చేరే అవకాశం ఉంది. పోలింగ్‌కు ముందు బుధ, గురువారం లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప..పట్టుకుని అమ్మితే జైలే..

హుజూరాబాద్‌లో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి మూడు ప్రధాన పార్టీల తరఫున ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్‌ మే సవాల్ అంటూ రణరంగాన్ని తలపించాయి. అయితే ప్రత్యక్షంగా ప్రచారం ముగిసిన తర్వాత అసలు కథ అప్పుడే మొదలవుతుందంటున్నారు. ప్రలోభాలపర్వంపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

×