Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నిక…నేటితో ప్రచారానికి తెర
హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్‌కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్‌లో మైక్‌లు మూగబోనున్నాయి.

Huzurabad by-election campaign : హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్‌కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్‌లో మైక్‌లు మూగబోనున్నాయి. పార్టీలన్నీ మిగిలిన కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్ ప్రచార సభ ఉంటుందని చర్చ జరిగింది. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఈసీ అనుమతి నిరాకరించడంతో సభ రద్దైంది. దీంతో ఈసీపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధి దాటుతోందని మండిపడ్డారు. ఈసీ కోవిడ్ నిబంధనల కారణంగా టీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం పార్టీ శ్రేణులకు ప్రగతి భవన్ నుంచి దిశానిర్ధేశం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ విధానాలతో పార్టీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారు కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే గ్రామాల్లో టీఆర్ఎస్ క్యాడర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మండల స్థాయిలో తటస్థంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడారు సీఎం కేసీఆర్. వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. సీఎం స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
Huzurabad By Poll : హుజూరాబాద్ ఎన్నికలు..12 మంది అవుట్
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. బైపోల్ కోసం.. బీజేపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. కేంద్ర పథకాలు, నిధులతో.. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని అందులో తెలిపారు. మరోవైపు ఈసీ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటల్లోగా.. హుజూరాబాద్‌లో మకాం వేసిన నాన్ లోకల్స్ అంతా నియోజకవర్గాన్ని వీడాల్సి ఉంది. దీంతో మిగిలిన ఈ కాస్త సమయాన్ని వృథా చేసుకోకుండా.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ప్రత్యేకంగా నిలిచింది. ఎక్కువ కాలం ఎన్నికల ప్రచారం కొనసాగిన నియోజకవర్గంగా రికార్డ్ సృష్టించింది. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో బై పోల్ జరుగుతోంది. సెప్టెంబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నోటిఫికేషన్‌కు ముందే టీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దిగాయి. నోటిఫికేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో దిగారు. అప్పటి నుంచి ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఏ ఎన్నికైనా…కేవలం 15 నుంచి 20 రోజులకు మించి ప్రచారాలు జరిగిన దాఖలాలు లేవు.
Huzurabad by poll: హుజూరాబాద్ బై పోల్ అభ్యర్థుల్లో బలహీనతలేంటి..?
కానీ హుజూరాబాద్‌లో దాదాపు రెండు నెలలుగా క్యాంపెయిన్ సాగింది. అయితే జూన్ 12నుంచే టీఆర్ఎస్, బీజేపీ అప్రకటిత ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఏడో సారి ఆత్మగౌరవ బావుట ఎగురవేయాలని భావిస్తున్నారు ఈటల. ఇక మొదటిసారి తమ అధృష్టాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరీక్షించుకుంటున్నారు. అయితే.. హుజూరాబాద్ ఓటర్లు ఏమనుకుంటన్నారు.. ఎవరిని తమ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారన్నది మాత్రం.. ఈ నెల 30న ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. నవంబర్ 2న భవితవ్యం తేలిపోనుంది.
- TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
- Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి
- Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!: సీఎం పుష్కర్ సింగ్
- Malla Reddy Hot Comments : కాబోయే ప్రధాని కేసీఆర్, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది- మంత్రి జోస్యం
- BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
1Salt : ఉప్పు వాడకంలో పొదుపు మంచిదే!
2Jignesh Mevani: నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేను: జిగ్నేశ్ మేవానీ
3Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు
4Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా
5Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!
6Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
7Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
8Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
9Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
10Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
-
YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు