AP CID : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులే.. ఏపీ సీఐడీ వార్నింగ్

సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు, ఫొటోలు పెడుతున్నారా? ముందూ.. వెనుక.. ఆలోచన చేయకుండా వేరేవాళ్లవి షేర్ చేస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్. తీవ్ర పరిణామాలు తప్పవు. కేసుల్లో..

AP CID : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులే.. ఏపీ సీఐడీ వార్నింగ్

Ap Cid

AP CID : సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు, ఫొటోలు పెడుతున్నారా? ముందూ.. వెనుక.. ఆలోచన చేయకుండా వేరే వాళ్లవి షేర్ చేస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్. తీవ్ర పరిణామాలు తప్పవు. కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అవును.. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారికి ఏపీ సీఐడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా, కించపరిచేలా పోస్టులు పెట్టినా కేసులు ఫైల్ చేస్తామంది. అంతేకాదు డబ్బులిచ్చి దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పింది.

డబ్బు కోసమో లేక లాభాపేక్షతోనో… ప్రభుత్వాన్ని, మహిళలను, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని, శిక్ష తప్పదని ఏపీ సీఐడీ వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టులను, వీడియోలను, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని, అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సీఐడీ హితవు పలికింది. ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది.

Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?

కాగా, టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సమన్వయకర్త సంతోష్ ను సీఐడీ అధికారులు తాజాగా రాజమండ్రిలో అదుపులోకి తీసుకుంది. సీఎం జగన్ మాట్లాడిన ఓ వీడియోను సంతోష్ మార్ఫింగ్ చేశారని, సీఎం ప్రసంగాన్ని అభ్యంతరకర రీతిలో మార్చేశారని సీఐడీ ఆరోపించింది.