CM Ys Jagan Mohan Reddy : అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్, టీవీలు, విద్యార్థులకు ట్యాబ్‌లు – సీఎం జగన్ కీలక ఆదేశాలు

వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశలవారిగా క్లాస్ రూముల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

CM Ys Jagan Mohan Reddy : అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్, టీవీలు, విద్యార్థులకు ట్యాబ్‌లు – సీఎం జగన్ కీలక ఆదేశాలు

Jagan On Elections

Updated On : August 12, 2022 / 5:50 PM IST

CM Ys Jagan Mohan Reddy : వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశలవారిగా క్లాస్ రూముల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

శుక్రవారం విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాకానుక కింద అందించే బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్స్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ లు వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించిన సీఎం జగన్.. ఎలాంటి రిపేర్లు వచ్చినా వెంటనే చేసే విధానం తీసుకురావాలని చెప్పారు.

శుక్రవారం విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

”8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి. ట్యాబ్ ల సేకరణ కోసం వెంటనే టెండర్లు ఖరారు చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్డర్ ఇవ్వాలి. ప్రతి స్కూల్ కు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలి. దశల వారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికల్లా సిద్ధంగా ఉంచాలి. పాఠశాలలకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా, వెంటనే బాగు చేసే విధానం తీసుకురావాలి” అని అధికారులకు నిర్దేశించారు సీఎం జగన్.