AP Covid-19 : ఏపీలో తొలిసారి ‘జీరో’ కోవిడ్ కేసులు..

AP Covid-19 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిసారిగా కరోనా కేసులు జీరోగా నమోదయ్యాయి.

AP Covid-19 : ఏపీలో తొలిసారి ‘జీరో’ కోవిడ్ కేసులు..

Ap Covid 19 First Time No Covid Cases Found In Andhra Pradesh State

AP Covid-19 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిసారిగా కరోనా కేసులు జీరోగా నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా ఒక్క కరోనా కేసు కూడా ఏపీలో నమోదు కాలేదు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి పరీక్షలు నిర్వహించింది. అయితే ఒకరిలో కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.

ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 12 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 3,3519,781 నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇదే తరహాలో కరోనా జాగ్రత్తలను పాటిస్తూ ఉంటే.. అతి త్వరలో ఏపీని కరోనా ఫ్రీ స్టేట్‌గా ప్రకటించవచ్చనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా ఏపీలో సింగిల్ డిజిట్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజు మాత్రం (ఏప్రిల్ 25) జీరో కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 20, 21వ తేదీల్లో ఒకే ఒక కరోనా కేసు నమోదైంది. ఏప్రిల్ 22న 4 కేసులు, 23వ తేదీన 2 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే కరోనాను పూర్తిగా రాష్ట్రంలో నిర్మూలించే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచిస్తున్నారు.

Read Also :  AP Covid Latest News : ఏపీలో కరోనా.. 2,870 శాంపిల్స్ పరీక్షించగా..