AP Crime : ఏపీలో ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్ప‌ద మృతి..

ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌ఐ  అనుమానాస్పదంగా మృతి చెందారు. అతని మరణానికి కారణం ఆత్మహత్యా? లేదా గన్ మిస్ ఫైరా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.

AP Crime : ఏపీలో ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్ప‌ద మృతి..

Kakinada District Sarpavaram Si Gopalakrishna Suspicious Death

Updated On : May 13, 2022 / 12:33 PM IST

AP Crime  : ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌ఐ  అనుమానాస్పదంగా మృతి చెందారు. అతని మరణానికి కారణం ఆత్మహత్యా? లేదా గన్ మిస్ ఫైరా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు తెలుస్తుండగా.. అధికారులు మాత్రం గన్ మిస్‌ ఫైర్‌ జరిగి మృతి చెందారని చెబుతున్నారు. కాగా..మరోపక్క ప్రభుత్వం.. జిల్లా ఎస్పీ వేధింపుల వల్లే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించటం గమనించాల్సిన విషయం. కానీ మరోవైపు కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

గోపాలకృష్ణకు ట్రైనింగ్ పూర్తయ్యాక కొంతకాలంపాటు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో డ్యూటీ నిర్వహించారు. ఆ తర్వాత సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఎస్‌ఐ గోపాలకృష్ణ మృతదేహాన్ని ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతని మరణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాతే గోపాలకృష్ణ మరణం గురించి పూర్తి వివరాలు తెలియనుంది.

ఎస్ఐ గోపాల‌కృష్ణ స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌లోని జగ్గ‌య్య చెరువు. గోపాల‌కృష్ణ‌కు పావ‌నితో ఐదేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి మూడేళ్ల పాప, ఏడాది వయస్సున్న బాబు ఉన్నారు. గోపాల‌కృష్ణ మృతితో ఆ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.