National swimming Day 2023 : స్విమ్మింగ్ పూల్‌లో జలాసనం వేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం వేశారు. ఆయన్ని చూడటానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Kolagatla Veerabhadra Swamy jala Asanam
Kolagatla Veerabhadra Swamy jala Asanam : జులై 11 నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే (National swimming Day 2023). ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విజయనగరంలో జిల్లా (Vizianagaram District)లో నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే సెలబ్రేషన్స్ (National swimming Day Celebrations 2023)జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయనగరం రింగురోడ్డులోని స్పోర్డ్స్ కాంప్లెక్స్ లోని పూల్ లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Assembly Deputy Speaker)కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) జలాసనం (jala Asanam)వేశారు.
ప్రజల్లో జలక్రీడలపట్ల చైతన్యం కల్పించేందుకు విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే (Vizianagaram Constituency MLA), ఉప సభాపతి (Deputy Speaker)కోలగట్ల వీరభద్రస్వామి ఆక్వా స్విమ్మింగ్ ఫూల్‌లో గంటపాటు జలాసనం వేశారు. ఆయన వేసిన ఈ జలాశనం చూడటానికి స్థానికులు తరలి వచ్చారు. ఈ సెలబ్రేషన్స్ లో డిప్యూటీ సీఎం రాజన్నదొర, స్పీకర్ తమ్మినేని సీతారాం, విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ,ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ లతో పాటు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.