AP Government : సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

AP Government : సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Cm Jagan (1) 11zon

AP government decision : సినిమా పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో భూసేకరణకు నిర్ణయించింది. సినిమా షూటింగ్ లు, స్టూడియోల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భూనిధి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమల్లో.. సినీ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సినిమా షూటింగ్, స్టూడియోల కోసమే ఈ భూములను వినియోగించనుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాల్లో.. భూనిధి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారానే.. ఆ భూములను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు విధానాల ద్వారా స్టూడియోల నిర్మాణానికి కసరత్తు చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. నిర్మాణం-నిర్వహణ-బదిలీ విధానంలో స్టూడియోలు.. ఏర్పాటు చేసేందుకు బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్టూడియోల నిర్మాణాలకు కూడా భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Operation Parivartan : ఏపీలో గంజాయి నిర్మూలనకు ఆపరేషన్‌ పరివర్తన్‌.. దేశంలోనే మొదటిసారిగా 2లక్షల కేజీల గంజాయి ధ్వంసం

ఫిబ్రవరి 10న తెలుగు సినిమా ప్రముఖులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలని అన్నారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. అందరికీ స్ధలాలు ఇస్తామని, స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామని, జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామన్నారు. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండి అని జగన్ అన్నారు.

తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థిటయేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోందని.. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోందని చెప్పారు. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ అన్నారు. వాతావరణం కూడా బాగుంటుందన్నారు.

CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం అన్నారు. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి… అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా… ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను .. అని అన్నారు.

 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో విశాఖ పోటీ పడగలదన్నారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలన్నారు. సినీ పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని ప్రకటించారు. టికెట్ రేట్లకు సంబంధించి అందరికీ ఒకే రేట్లు అని చెప్పారు. ఆన్ లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి మంచిదని అభిప్రాయపడ్డారు. సినిమా చూసే ప్రేక్షకులకు టికెట్ రేట్ల భారం కాకూడదన్నారు. ఐదో షో వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని పేర్కొన్నారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా తనతో పంచుకున్నారని తెలిపారు.