Operation Parivartan : ఏపీలో గంజాయి నిర్మూలనకు ఆపరేషన్‌ పరివర్తన్‌.. దేశంలోనే మొదటిసారిగా 2లక్షల కేజీల గంజాయి ధ్వంసం

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గంజాయి సాగును నిర్మూలనకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆపరేషన్‌ పరివర్తన్‌ను ముమ్మరం చేసింది. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.

Operation Parivartan : ఏపీలో గంజాయి నిర్మూలనకు ఆపరేషన్‌ పరివర్తన్‌.. దేశంలోనే మొదటిసారిగా 2లక్షల కేజీల గంజాయి ధ్వంసం

Parivartan

cannabis eradication in AP : ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సాగుపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, ఏవోబీ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. ఆ సోదాల్లో పట్టుబడిన గంజాయిని ఇవాళ పోలీసులు దహనం చేశారు. దేశంలోనే మొదటిసారిగా 2 లక్షల కేజీల గంజాయికి ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ నిప్పు పెట్టారు. తగులబెట్టిన గంజాయి విలువ సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఆపరేషన్ పరివర్తన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆపరేషన్‌ పరివర్తన్‌ను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్‌ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు అన్ని ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘా పెంచారు. గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై నాలుగు జిల్లాలో 1363 కేసులు నమోదు చేసి.. 1500 మందిని అరెస్ట్ చేశారు. వందల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు.

AP Government : సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ఇక.. ఏపీలో గంజాయి అక్రమ తరలింపు, సాగు వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీరియస్ అయ్యారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన చేపట్టామని చెప్పారు. గంజాయి పండించేవారికి మావోయిస్టులు సహకరిస్తున్నారని దాని ద్వారానే వారు డబ్బులు సమకూర్చుకుంటున్నారన్నారు సవాంగ్. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదన్నారు.

దేశవ్యాప్తంగా గంజాయి స్మగ్లర్లు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని విధానాలు, మార్గాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. గంజాయితో మావోయిస్టులు డబ్బులు సంపాదిస్తున్నారని వెల్లడించారు. ఒడిశాలోని 23 జిల్లాలు, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగవుతుందన్నారు. ఆపరేషన్‌ పరివర్తన్‌ ద్వారా 406 ప్రత్యేక బృందాలతో..రూ.9251.32 కోట్ల విలువనైన 7552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశామని తెలిపారు.

CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేశారని వెల్లడించారు. గంజాయి నివారణ కోసం 120 అంతర్‌రాష్ట్ర, జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో గంజాయి సాగు, రవాణా చేస్తున్న 1500 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి 47,987 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 46.41 లీటర్ల హషిష్‌ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాం, 314 వాహనాలు సీజ్‌ చేశామని చెప్పారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన 154 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశామని అన్నారు. నాలుగు జిల్లాల్లో 1363 కేసుల నమోదు చేశామని పేర్కొన్నారు. 4 జిల్లాల పరిధిలో 2 లక్షల కేజీల గంజాయి తగలబెడుతున్నామని చెప్పారు. గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.