Inter, SSC exams: టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ(03 జూన్ 2021) విచారించి హైకోర్టు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

Inter, SSC exams: టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు విచారణ

AP High Court on exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ(03 జూన్ 2021) విచారించి హైకోర్టు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

జులైలో పరీక్షల నిర్వహణపై సమీక్ష జరపనున్నట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టంచేసింది. పరీక్షలకు 15రోజుల ముందే సమాచారం ఉంటుందన్న ప్రభుత్వం.. తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలో పరీక్షల నిర్వహణ రోజురోజుకు వివాదస్పదం అవుతోంది. కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించవద్దని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్తోంది.