High Court : పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పండి? సీబీఐపై హైకోర్టు సీరియస్

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా..

High Court : పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పండి? సీబీఐపై హైకోర్టు సీరియస్

Ap High Court

High Court : న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా విచారించింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్టులను తొలగించి, బ్లాక్ చేశారని విచారణ సందర్భంగా లాయర్ అశ్వినీ కుమార్ కోర్టుకు వివరించారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

సోషల్ మీడియా సంస్థలకు తాము కూడా లేఖ రాశామని సీబీఐ చెప్పగా, లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏముందని కోర్టు ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని సీబీఐని అడిగింది. సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

తాము చెప్పింది వినకపోతే… మీరు చెప్పేది కూడా మేము వినబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏం చేయాలో తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామంది. కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత కూడా పంచ్ ప్రభాకర్ గూగుల్ లో తన ఫొటోతో సహా చిరునామాను ఉంచారని ధర్మాసనం దృష్టికి అశ్వినీ కుమార్ తీసుకొచ్చారు. దీంతో, ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. సాయంత్రానికల్లా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.