Taneti Vanitha : అసాని తుఫాన్ తో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి తానేటి వనిత

అసాని తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అధికారులందరూ అలెర్ట్ గా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Taneti Vanitha : అసాని తుఫాన్ తో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి తానేటి వనిత

Taneti

Home Minister Taneti Vanitha : అసాని తుఫాన్ దూసుకొస్తోంది. అసాని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. అసాని తుఫాన్ దూసుకొస్తున్న తరుణంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి తానేటి వనిత సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా SDRF, NDRF బృందాలను సిద్ధం చేసినట్లు డైరెక్టర్ అంబేద్కర్ హోంమంత్రికి తెలిపారు.

అసాని తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అధికారులందరూ అలెర్ట్ గా ఉండాలని హోం మినిస్టర్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి సూచించారు. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని తెలిపారు. తీరప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హోం మినిస్టర్ వనిత అధికారులను ఆదేశించారు.

Asani Cyclone : తీవ్ర తుఫానుగా అసాని.. తీర ప్రాంత ప్రజలకు అలర్ట్

అసాని తుఫాన్ తీవ్ర తుఫానుగా బంగాళాఖాతంలో కొనసాగుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ, సముద్రంలోనే క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.

Cyclone Asani : ముంచుకొస్తున్న అసని తుపాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం..!

అసాని తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబై, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.