AP : పరిషత్ ఓట్ల లెక్కింపు..ఎలా లెక్కిస్తారో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.

AP : పరిషత్ ఓట్ల లెక్కింపు..ఎలా లెక్కిస్తారో తెలుసా ?

Ap Election

AP MPTC, ZPTC : ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. సాయంత్రం ఫలితాలు విడుదలకానున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్‌ సెంటర్లకు ఎన్నికల సిబ్బంది శనివారం చేరుకుంది. ఏజెంట్ల వివరాలను పార్టీలు కూడా అందించడంతో.. వారిని మాత్రమే అనుమతించేలా పోలీసులకు లిస్ట్‌ కూడా చేరింది. ఆయా పార్టీ ఏజెంట్ల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. 42వేల 360 మంది సిబ్బంది ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు.

Read More  : Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర

ఇందులో 11వేల 227 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా, 31వేల 133 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్న వారినే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రానికి 200 మీటర్లలోపు ఎవరినీ అనుమతించబోమన్నారు. మరోవైపు గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలను జరుపవద్దని సూచించింది ఎస్‌ఈసీ. ర్యాలీలు, ప్రదర్శనలు చేయవద్దని తెలిపింది.పెద్ద ఎత్తున బ్యాలెట్‌ పత్రాలను లెక్కించాల్సి రావడంతో కౌంటింగ్‌ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. దీంతో జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది ఎస్‌ఈసీ. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ హాల్లోకి బ్యాలెట్‌ బాక్సులను తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్‌ చేయనున్నారు.

Read More  : Allu Arjun – Trivikram : క్రేజీ కాంబో మళ్లీ కుదిరింది..

ఒక్కో మండలానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే చోటే…. జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఏకకాలంలో రెండింటి ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. సగం టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మరో సగం టేబుళ్లలో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగనున్నట్టు ఎస్‌ఈసీ తెలిపింది.ఎంపీటీసీ పరిధిలోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో, మండలంలోని మొత్తం జడ్పీటీసీ ఓట్లన్నింటినీ మరో డ్రమ్‌లో వేసి కలగలపి తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత  జడ్పీటీసీ ఓట్లను వెయ్యి చొప్పున ఒక్కో టేబుల్‌కు పంపిణీ చేసి లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాల వారీగా అక్కడి ఓట్లన్నింటినీ ఒకే టేబుల్‌పై ఒకేవిడతలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక్కో ఏజెంట్‌ చొప్పున నియమించుకునేందుకు అభ్యర్థులను అనుమతించారు.

Read More  : ChinnaJeeyar : ప్రధాని మోదీకి చిన్నజీయర్‌ ఆహ్వానం..ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహ ఆవిష్కరణ

ఏపీలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 375 చోట్ల ఎన్నికలు జరగలేదు. 9 వేల 672 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే.. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్థులు మృతి చెందిన చోట 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7 వేల 220 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఆదివారం మొత్తం 18 వేల 782 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఇక రాష్ట్రంలో  660 జెడ్పీటీసీ స్థానాలుండగా… 652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పలు కారణాలతో 8 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్ధులు మరణించడం వల్ల మరో 11 స్థానాల్లో కూడా పోలింగ్ అగిపోయింది. నోటిఫికేషన్ జారీ సమయంలో 8 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల పోలింగ్ ఆగిపోయింది. 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 2 వేల 58 మంది అభ్యర్థులు తమ లక్కును పరీక్షించుకోనున్నారు.