AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి.

AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 31వేల 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కేసులు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,486కి పెరిగింది.

Urination : మూత్రపిండాల ఆరోగ్యం మూత్ర విసర్జనతో చెప్పవచ్చా?…

గడిచిన 24 గంటల్లో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,60,400 మంది కోలుకున్నారు. 1,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.