AP Corona : ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే…

ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు

AP Corona : ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే…

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. ఒక్క జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రోజువారీ కేసుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండటం, యాక్టివ్ కేసుల సంఖ్య సైతం 7వేల కంటే దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం. మూడు జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 32వేల 846 శాంపుల్స్ పరీక్షించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108, కృష్ణా జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో రెండు కేసులు గుర్తించారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

Prakash Raj : భోరున ఏడ్చిన బెనర్జీ.. మా అమ్మను తిట్టారంటూ తనీష్ భావోద్వేగం..

అదే సమయంలో 817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 12 మంది కొవిడ్ తో మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,268కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,36,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 6వేల 932 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..
అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 108, తూర్పుగోదావరి జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 68, కడప జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 88, కర్నూలు జిల్లాలో 04, నెల్లూరు జిల్లాలో 38, ప్రకాశం జిల్లాలో 44, శ్రీకాకుళం జిల్లాలో 09, విశాఖపట్నం జిల్లాలో 41, విజయనగరం జిల్లాలో 02, పశ్చిమగోదావరి జిల్లాలో 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Uttej: అన్నయ్యనే అనుమానిస్తావా? ఫేస్‌లో ఫేస్ పెట్టి అమ్మను తిట్టాడు

జిల్లాల వారీగా కరోనా మరణాల వివరాలు..
చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

రాష్ట్రంలో తాగా నిర్వహించిన 32,846 నిర్వహించిన టెస్టులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన శాంపిల్స్ సంఖ్య 2,88,00,809కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సగటున 40వేల నుంచి 50వేల వరకు కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.