రాజ్యాంగం నాకు అపారమైన అధికారాలు ఇచ్చింది

రాజ్యాంగం నాకు అపారమైన అధికారాలు ఇచ్చింది

AP SEC Nimmagadda key comments : ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో తనకు రాజ్యాంగం అపారమైన అధికారాలు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పును తాను కచ్చితంగా పాటిస్తానని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

అంతకముందు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై క్లారిటీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు శ్రుతిమించరాదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు శ్రుతిమించడం అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీతో శాంతిభద్రతల సమస్య తలెత్తదని స్పష్టం చేశారు.

ఎన్నికలతో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనడం సరికాదని అభిప్రాయపడ్డారు. పోటీతత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసినా.. పూర్తయ్యాక అందరూ కలిసి ఉంటారని తెలిపారు.