Brahmamgari Matam : బ్రహ్మంగారి పీఠం ఎవరికి?..మఠానికి 12మంది పీఠాధిపతులు..

Brahmamgari Matam : బ్రహ్మంగారి  పీఠం ఎవరికి?..మఠానికి 12మంది పీఠాధిపతులు..

Ap Sri Potuluri Veera Brahmamgari Matham Pedestal Dispute In Kadapa District

Sri Potuluri Veera Brahmamgari Matam : కడపజిల్లాలోని బ్రహ్మంగారిమఠం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వీరబ్రహ్మంగారి మఠానికి సంబంధించి పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే అంశంపై పలువులు పీఠాధిపతులు ఈరోజు మఠానికి రానున్నారు.శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు పన్నెండు మంది పీఠాధిపతులు రానున్నారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు మఠం వద్ద భారీగా మోహరించారు. పీఠాధిపతులు వస్తే వారిని లోపలికి వెళ్లటానికి అనుమతించేది లేదని చెబుతున్నారు. కారణం..ఏపీలో కరోనా నియంత్రణ కోసం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈక్రమంలో పలు ప్రాంతాల నుంచి పీఠాధిపలుు రానుండగా కరోనా నిబంధనల మేరకు వారిని అడ్డుకుంటామని చెబుతున్నారు.

కాగా పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే అనే అంశం వివాదంగా మారాటంతో దాన్ని పరిష్కరించటానికి 12మంది పీఠాధిపతులు ఈరోజు ఇక్కడికి రానున్నారు. రెండు రోజులపాటు ఇక్కడే విడిది చేయనున్న పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాద పరిష్కారం కోసం చర్చించటానికి రానున్నారు. రెండు రోజుల పాటు భక్తుల మనోభావాలతో పాటు గతంలో మళాధిపతుల శిష్యులతో కూడా చర్చించనున్నారు. అలాగే స్థానికులతో కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చర్చలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగితే..బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతిగా ఎవరు ఉండనున్నారో ఓ క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

కాగా.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? పీఠం కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది విషయం వివాదాస్పదంగా మారింది. బ్రహ్మంగారి ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది పెద్ద అంశంగా మారింది. కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన విషయంతెలిసిందే. ఆ ఆయన సమాధి అయిన తరువాత ఆ ప్రాంతాన్ని బ్రహ్మంగారి మఠంగా భావించి..దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా నియమితులై కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఇదే ఆనవాయితీ కొనసాగుతొంది. అలా ఇప్పటి వరకూ ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.

ఈ క్రమంలో ఆఖరిగా బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండగా..ఆయన ఇటీవల మరణించారు. దీంతో మరోసారి పీఠాధిపతిని నియమించాల్సి ఉంది. పీఠాధిపతి పదవి ఖాళీ అవ్వటంతో మరోసారి ఈ పీఠాధిపతి ఎవరిని నియమించాలి? అనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎవరిని పీఠాధిపతిని చేయాలనేది పెద్ద అంశంగా మారింది.

కాగా కాలజ్ఞానాన్ని రచించిన వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి మొదటి భార్య చంద్రావతమ్మ. ఆమెకు 8 మంది పిల్లలు. రెండవ భార్య మారుతి మహాలక్ష్మమ్మ. మొదటి భార్య చంద్రావతమ్మకు నలుగురు కొడుకులు,నలుగురు కూతుళ్లు. మొదటి భార్య చనిపోవటంతో బ్రహ్మంగారు మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఈ క్రమంలో వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి సమాధికి ముందే ఆయన మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేను అంటూ ఇరు కుటుంబాల మధ్యా వివాదం మొదలైంది .దీంతో విచారణను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

కాగా..వీరబ్రహ్మంగారి పీఠాధిపతి కావాలంటే దానికి కొన్ని అర్హతలుండాలని నిబంధనల్లో ఉంది. హిందూమతం, వేదాంత శాస్త్రంలో చక్కటి పరిజ్ఞానం ఉండాలి. ధార్మిక గ్రంధాలలో, మఠానికి సంబంధించి పాటించాల్సిన సంప్రదాయాలు, నియమ నిబంధనలు ఎలా చేయాలి? ఏమేమి చేయాలని అనే విషయంపై పరిజ్ఙానం కచ్చితంగా తెలిసి ఉండాలి. అంతేకాదు మఠంలో శిష్యులకు జ్ఞానబోధ చేయటం..వారిని సరైన దారిలో నడిపించేలా సంప్రదాయాలను నేర్పించే సమర్థత కలిగి ఉండాలి. క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించేలా చేయాలి. ఈ అర్హతలు కలిగిన వారి పేరు ప్రతిపాదించిన అనంతరం దేవాదాయశాఖ కమిషనర్‌తో పాటు నలుగురు సభ్యులు పేరును ప్రతిపాదించి 90 రోజుల్లో దానిపై ధార్మిక పరిషత్‌ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అందరి సమక్షంలో బ్రహ్మంగారి పీఠాధిపతి పేరును ప్రకటిస్తుంది. ఈక్రమంలో పీఠాధిపతిని నిర్ణయించటానికి శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు పన్నెండు మంది పీఠాధిపతులు చేరుకున్నారు. రెండు రోజుల పాటు చర్చలు జరుగనున్నాయి.