Tirupati Murder Case : ఏపీ టూరిజం ఉద్యోగి హత్య కేసు.. ‘దృశ్యం’ సినిమా తరహాలో క్రైమ్

మృతుడు చంద్రశేఖర్ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులే అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31న చంద్రశేఖర్ ను చంపి, అదే రోజు అతని మృతదేహాన్ని కారులో భాకరాపేట అడవిలోకి

Tirupati Murder Case : ఏపీ టూరిజం ఉద్యోగి హత్య కేసు.. ‘దృశ్యం’ సినిమా తరహాలో క్రైమ్

Tirupati Murder Case

Tirupati Murder Case : సంచలనం రేపిన ఏపీ టూరిజం ఉద్యోగి చంద్రశేఖర్ హత్య కేసులో నిందితులు రాజు, పురుషోత్తంలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి మధుబాబు పరారీలో ఉన్నాడు. మృతుడు చంద్రశేఖర్ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులే అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31న చంద్రశేఖర్ ను చంపి, అదే రోజు అతని మృతదేహాన్ని కారులో భాకరాపేట అడవిలోకి తీసుకెళ్లి పారేశారని పోలీసులు తెలిపారు. ఈ మర్డర్ కేసులో నిందితులు తాము దొరక్కుండా ఉండేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేశారు. ‘దృశ్యం’ సినిమా తరహాలో సీన్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. మృతుడు చంద్రశేఖర్ బైక్, మొబైల్ ను కిషోర్ అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉంచి, అతనిపై నేరం మోపడనికి నిందితులు యత్నించారని పోలీసులు చెప్పారు.

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఏపీ టూరిజం శాఖ ఉద్యోగి శవమై తేలాడు. మృతదేహాన్ని బాకరాపేట ఘాట్ సమీపంలోని అడవిలో గుర్తించారు. అప్పు తీసుకున్న వ్యక్తులు ముగ్గురు చంద్రశేఖర్ ను రాడ్లతో కొట్టి చంపారు. డిసెంబర్‌ 31 నుంచి తన తండ్రి కనిపించకుండా పోయాడని చంద్రశేఖర్ కుమారుడు రూపేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డొంకంతా కదిలింది.

MERCEDES-BENZ : ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కిమీ ప్రయాణం.. మెర్సిడెస్ బెంజ్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కారు

”తిరుపతి ఎల్బీనగర్‌లో నివాసముండే చంద్రశేఖర్ (53) ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 31 న అతడి కుమారుడు రూపేష్‌ కుమార్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దాంతో తన తండ్రి అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయగా.. తిరుచానూరు కృష్ణశాస్త్రినగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము.

అప్పుగా తీసుకున్న మొత్తానికి అధికంగా వడ్డీ వసూలు చేస్తుండటంతో చంద్రశేఖర్‌పై ముగ్గురు వ్యక్తులు కోపంతో ఉన్నారు. చంద్రశేఖర్‌కు వ్యాపారి మధుబాబు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.14.50 లక్షలు బాకీ పడ్డాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని చంద్రశేఖర్‌ ఒత్తిడి చేయడంతో దామినీడు చంద్రగిరికి చెందిన పురుషోత్తంతోపాటు మధుబాబు, రాజులు.. చంద్రశేఖర్‌ను అంతం చేయాలని స్కెచ్ వేశారు. డబ్బు ఇస్తానని పెద్దకాపు లేఔట్ కు రావాలని చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేశారు. అక్కడికి రాగానే ముగ్గురూ ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టడంతో చంద్రశేఖర్ తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. మృతదేహాన్ని ప్లాస్టర్‌తో చుట్టి శవపేటికలో ఉంచి బాకరాపేట ఘాట్ అడవిలో పడేశారు” అని తిరుపతి వెస్ట్ డీఎస్పీ నర్సప్ప తెలిపారు.