Tirupati : తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం

తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు.

Tirupati : తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం

Tirupati (1)

demolish a collapsed house : తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు. ఇంటి చుట్టుపక్కల వారిని అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇటీవల భారీ వర్షాలకు తిరుపతిలో చాలా ఇళ్లు కుంగిపోయాయి. 160 పాత భవనాలను కూల్చాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆ మేరకు కుంగిన ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు.

శ్రీకృష్ణానగర్‌లో కూల్చేవస్తున్న ఇల్లు కేవలం మూడు నెలల కిందటే పూర్తైంది. రోజు వారి హోటల్‌ నడుపుకునే ఇంటి యజమాని లక్షలు ఖర్చుపెట్టి ఇంటిని కట్టుకున్నారు. కొత్త భవనం ఇక ఇరవై, ముప్పై సంవత్సరాలు తమకు ఢోకా లేదనుకున్నారు. ఇంతలోనే రాకాసి వరదలు కొంప ముంచాయి. వరద నీరు నిల్వడం, భూగర్భ జలాలు ఉబికి వస్తుండటంతో… మూడంతస్తుల భవనం ఒకవైపు కుంగిపోయింది. బిల్డింగ్ గోడలు బీటలు వారాయి.

Lok Sabha : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఇక.. పరిహారం ఇచ్చాకే కూల్చివేతలు చేపట్టాలంటూ శనివారం బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో బాధిత కుటుంబీకులతో స్థానిక ఎమ్మార్వో వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.95 వేల నగదు, ఒక ఇంటిని నిర్మించి ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల స్పష్టమైన హామీతో బాధితులు అక్కడ ఆందోళనలను రాత్రి సమయంలో విరమించారు. ప్రస్తుతం ఇళ్లు కుంగిన పరిసరాల్లో పోలీసులు సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు.