Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి.. తెల్లవారుజాము నుంచే చలి మంటలు

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి.

Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి.. తెల్లవారుజాము నుంచే చలి మంటలు

BHOGI

Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. భోగభాగ్యాలు తెచ్చే తెలుగువారి భోగి అంటే చలి మంట మాత్రమే కాదు..ప్రతి సంవత్సరం సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు.

దీని ద్వారా చలికి గుడ్ బై చెబుతారు. భోగి మంటల్లో ఇళ్లలోని పాత వస్తువులు, విరిగి పోయిన మంచాలు, కుర్చీలు, వాడని వాటిని వేస్తారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో నాలుగు రోజులు పండుగ వాతావరణం ఉంటుంది. సంక్రాంతికి హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు.

Sankranti Bus Stands Passengers : సంక్రాంతికి పల్లెబాట పడుతున్న నగరవాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

మొదటి రోజైన భోగి పండుగకు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. హరిదాసులు, గంగి రెద్దులతో తెలుగు లోగిలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కూడా భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

కేబీఆర్ పార్క్ లో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భారత జాగృతి భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కవిత ముుఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారుల ఆట, పాటలతో కేబీఆర్ పార్క్ లో కోలాహలం నెలకొంది. సంక్రాంతి ప్రత్యేక గీతాలతో గాయకులు అలరించారు.