Satyakumar : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది : బీజేపీ నేత సత్యకుమార్

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.

Satyakumar : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది : బీజేపీ నేత సత్యకుమార్

Jagan Satya Kumar

Satyakumar comments over Jagan : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అక్కడే జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పూనుకుందని పేర్కొన్నారు.

కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని సత్యకుమార్ తెలిపారు. దోచుకోవడానికే విశాఖ రాజధాని అని ప్రచారం చేశారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ జాతకం త్వరలో మారిపోనుందని జోస్యం చెప్పారు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే.. సీఎం జగన్ ఇంద్ర భవనంలో ఉంటూ వేడుక చూస్తున్నారని విమర్శించారు.

6 students murder case : విద్యార్థులను కొట్టి చంపిన కేసు..13 మందికి ఉరిశిక్ష..19 మందికి జీవిత ఖైదు

అమరావతి-విశాఖ-కర్నూలు మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును ఇటీవలే ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కొత్త బిల్లుతో వస్తామని సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. అయితే అది ఎప్పుడు..? కొత్త ప్రపోజల్ ఎలా ఉంటుంది..? అనేదానిపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ ఉత్కంఠకు ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ వేశారు.

వచ్చే ఏడాది మార్చిలో జరుగునున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని కర్నూలులో చెప్పారు. రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని తెలిపారు.

Road Accident : రోడ్డు ప్రమాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

అమరావతి ఒక్కటే ఏపీ రాజధానిగా ఉండాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఐతే… ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి 3 రాజధానుల అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకుంది. ఇదే దిశగా కొత్త నిర్ణయం తీసుకుని అమలు చేయాలని భావిస్తోంది.