HRA GO : విజయవాడ, గుంటూరులో ఇళ్లు అద్దెకు దొరుకుతాయా? కొత్త హెచ్ఆర్ఏ జీవోపై ఉద్యోగులు ఫైర్

తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ... ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

HRA GO : విజయవాడ, గుంటూరులో ఇళ్లు అద్దెకు దొరుకుతాయా? కొత్త హెచ్ఆర్ఏ జీవోపై ఉద్యోగులు ఫైర్

Ap Prc

HRA GO : హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్‌ఆర్‌ఏ జీవోలో కొత్తదనం లేదని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులో తగ్గించిన దాంట్లో భాగంగా ఇచ్చినదే ఈ జీవో అన్నారు.

తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ… ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ జీవోకు శాస్త్రీయత లేదని చెప్పారు. 11వ పీఆర్సీలో 30శాతం తగ్గకుండా ఇవ్వాల్సి ఉందన్నారు. దాన్ని తుంగలో తొక్కి… తూతూ మంత్రంగా ఏర్పాటైన అధికారుల కమిటీ ఈ జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని బొప్పరాజు అడిగారు.

Tollywood : రాజమౌళి ట్వీట్‌‌.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు

విజయవాడలో కానీ, గుంటూరులో కానీ.. ఈ హెచ్ఆర్ఏ ప్రకారం ఇళ్లు అద్దెకు దొరుకుతాయా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అడిగారు. అశుతోష్ నివేదికలో 30శాతం హెచ్ఆర్ఏను ప్రతిపాదించారని ఆయన అన్నారు. ఉద్యోగులపై అక్కసుతోనే డీడీవోలకు, ట్రెజరీ అధికారులకు ప్రభుత్వం మెమోలు ఇచ్చిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో.. ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఇప్పుడేమో ఫిబ్రవరి 1వ తేదీనే జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ దాని పరిసరాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. హెచ్ఓడీ అధికారుల సిఫార్సులతో హెచ్ఆర్ఏలను సవరించింది సర్కార్. అయితే ఇది రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ చెందిన పెంపు కాదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు తరలివచ్చిన హెచ్‌వోడీ కార్యాలయాల సిబ్బందికి మాత్రమే వర్తిస్తుంది.

గతంలో పాత పీఆర్సీ ప్రకారం ఈ ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ అమలయ్యేది. అయితే, కొత్త పీఆర్సీ జీవోల్లో జారీ చేసిన ఆదేశాల మేరకు హెచ్ఆర్ఏ తగ్గించారు. విజయవాడ – మంగళగిరి ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి వచ్చి రీ లొకేట్ అయిన ఉద్యోగులకు ప్రస్తుతం 8 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ అమలు చేసే విధంగా కొత్త పీఆర్సీ జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు వారికి 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ తాజాగా సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పీఆర్సీ అంశానికి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సమ్మెకు సైతం ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి.

Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీ జీవోల్లో.. హెచ్ఆర్ఏ శ్లాబుల విషయంలో ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రస్తావిస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని.. ఈ నెలకు పాత వేతనాలు ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్లు. అయితే, ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అంటోంది. కొత్త పీఆర్సీ మేరకే జీతాలు చెల్లించేందుకు ట్రెజరీ ఉద్యోగులకు సర్కులర్ కూడా జారీ చేసింది. అంతేకాదు ముందు చర్చలకు రావాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.